గురువారం, 23 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

కామ్రేడ్ పెనుమాక జక్రయ్య జోహార్లు

1 గంట క్రితం

prakasam
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 23, 2026, 05:20 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి- కొండేపి : కొండేపి మండలం పెరిదేపి గ్రామానికి చెందిన సీనియర్ సభ్యులు కామ్రేడ్ పెనుమాక జక్రయ్య మరణం చాలా బాధాకరమని సిపిఎం పేర్కొంది. ఆయన మృతి దేహానికి సీనియర్ నాయకులు ముప్పరాజు కోటయ్య ఎర్ర జెండా కప్పి నివాళులర్పించారు. సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి ఎస్కె మాబు పూలమాల వేసి నివాళులర్పించారు. సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కామ్రేడ్ కంకణాల ఆంజనేయులు నాయకులు మాట్లాడుతూ.. గత 45 ఏళ్లకు పైగా కామ్రేడ్ జక్రయ్య ఎర్రజెండాతో నిలబడ్డారని అన్నారు. నిత్యం రాజకీయాలను అధ్యయనం చేయటం, చర్చించటం, హేతువాద దృక్పథంతో జీవించటం ఆ కామ్రేడుకున్న ప్రత్యేకత అని కొనియాడారు. ఈ గ్రామంలో కామ్రేడ్ ముప్పరాజు శేషయ్య విజ్ఞాన కేంద్రం నిర్మాణం జరిగిన తర్వాత అక్కడే ఉండేవారని అన్నారు. గ్రామంలో కమ్యూనిస్టులను, మార్క్సిస్టు సిద్ధాంతాన్ని ఎవరైనా విమర్శిస్తే తగిన సమాధానం చెప్పటంలో దిట్ట అని, పార్టీ పట్ల కమిట్మెంట్ విషయంలో అతనికి అతనే సాటి అని అన్నారు. ఈ కాలంలో ఆయనకు కుటుంబంలో అనేక ఇబ్బందులు ఎదురయ్యాయని, గ్రామంలో పార్టీ అనేక ఆటంకాలను ఎదుర్కొందని, వాటన్నిటినీ అధిగమించి ఆ కామ్రేడ్ చివరివరకు ఎర్రజెండాతో నిలబడ్డారని అన్నారు. ఆ కామ్రేడ్ మరణం పార్టీకి తీరని లోటని అన్నారు. కామ్రేడ్ జక్రయ్యకు విప్లవ జోహార్లు అర్పించారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు కంకణాల రమాదేవి , రఘురాం , కేజీ మస్తాన్, కొండేపి మండల సిపిఎం నాయకులు, కొండేపి మండల పార్టీ కార్యదర్శి మల్లెల కొండయ్య తదితరులు పాల్గొని నివాళులు అర్పించారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్