గురువారం, 19 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

నిమ్మనపల్లిలో ఇద్దరు కూటమి ఎంపీటీసీలు అదృశ్యం

17 నిమిషాల క్రితం

అన్నమయ్య
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 19, 2026, 11:44 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

- ఆందోళనకు దిగిన కూటమి నాయకులు

ప్రజాశక్తి-నిమ్మనపల్లి: అన్నమయ్య జిల్లా నిమ్మనపల్లి మండలంలో కూటమి పార్టీలకు చెందిన ఇద్దరు ఎంపీటీసీలు అదృశ్యమయ్యారని కూటమి పార్టీలకు చెందిన నాయకులు రోడ్డుపై బైఠాయించి నిరసనలకు దిగారు. రాచవేటివారిపల్లి టిడిపి ఎంపీటీసీ ఆర్.మాధవి లత, ముష్టురు జనసేన పార్టీ ఎంపీటీసీ ఎం.మాలతిలు కనిపించడం లేదంటూ టిడిపి నాయకులు ఆందోళనకు దిగారు. వైసిపి నాయకులే కూటమి ఎంపీటీసీలను కనిపించకుండా చేశారని ఎంపీడీవో కార్యాలయంకు వెళ్లే దారిని టిడిపి నాయకులు అడ్డగించారు. రోడ్డుపై బైఠాయిస్తూ ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని నిరసనలు చేపట్టారు. కనిపించకుండా పోయిన తమ ఎంపీటీసీల్లో క్షేమంగా తమ దగ్గరికి పోలీసులు చేర్చాలని డిమాండ్ చేస్తున్నారు. వైఎస్ఆర్సిపి పార్టీ నాయకులు ప్రజాస్వామ్యాన్ని మండలంలో ఖూనీ చేస్తున్నారన్నారు. కార్యక్రమంలో టిడిపి మండల అధ్యక్షులు రాజన్న, నాయకులు మునిరత్నం, మల్లికార్జున, శ్రీపతి, జనసేన నాయకులు రమేష్ రాయల్, ఇతర నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్