గురువారం, 19 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

నదిలో పడిన సైనిక వాహనం - ఆర్మీ కెప్టెన్ మృతి

18 నిమిషాల క్రితం

army
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 19, 2026, 11:24 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

- మణిపూర్‌లో ఘోర ప్రమాదం.. ముగ్గురికి తీవ్ర గాయాలు

ఇంఫాల్: మణిపూర్‌లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. సైనికులను తీసుకువెళ్తున్న ఆర్మీ వాహనం అదుపుతప్పి నదిలో పడిపోవడంతో ఓ కెప్టెన్ మృతి చెందగా, మరో ముగ్గురు సైనికులు తీవ్రంగా గాయపడ్డారు. ఇంఫాల్ తూర్పు జిల్లాలోని ఇటమ్ నదిలో ఈ ప్రమాదం జరిగింది. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. 8వ బీహార్ రెజిమెంట్‌కు చెందిన సైనికులతో వెళ్తున్న వాహనం మధ్యాహ్నం సుమారు 2 గంటల సమయంలో లమ్లాయ్ చల్లౌ ప్రాంతంలో ప్రమాదానికి గురైంది. వాహనం అదుపుతప్పి నదిలో బోల్తాపడటంతో కొంతసేపు నీటిలో మునిగిపోయింది. ఈ ప్రమాదంలో 29 ఏళ్ల ఆర్మీ కెప్టెన్ హనుమాన్ రామ్ తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే ఆయనను ఇంఫాల్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మృతి చెందారు. ఈ ఘటనలో గాయపడిన మరో ముగ్గురు సైనికులను సిపాయి మాలి జయేష్ హిమ్మత్ (24), సిపాయి రాకేష్ సర్పతే (37), అగ్నివీర్ అఖిలేష్ కుమార్ షా (19)గా గుర్తించారు. వీరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం ఆసుపత్రిలో వైద్యులు చికిత్స అందిస్తున్నారు. అయితే సైనిక వాహనం నదిలో పడిపోవడానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. ప్రమాదానికి దారితీసిన పరిస్థితులపై అధికారులు విచారణ చేపట్టినట్లు సమాచారం.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్