ప్రజాశక్తి - రెడ్డిగూడెం: రెడ్డిగూడెం మండల పరిధిలోని అన్నేరావుపేట,రెడ్డిగూడెం, రంగాపురం, పరిసర ప్రాంతాల్లో చిరుత పులి సంచారం చేస్తుందని ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఈ గ్రామాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తహసీల్దార్ సుశీలదేవి గ్రామాల్లో మైక్ ప్రచారం ద్వారా తెలిపారు. కాగా గురువారం ఉదయం రంగాపురం ఎన్ఎస్పీ కెనాల్ కి సుమారు 200 మీటర్ల దూరంలో మామిడి తోటలో ఉన్నట్లు గుర్తించిన ఫారెస్ట్ అధికారులు యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. అనంతరం ర్యాపీడ్ రెస్పాన్స్ అండ్ రెస్క్యూటీం వారు ట్రాక్ పరిశీలన చేయగా పులి తన దిశను మార్చుకొని అన్నేరావుపేట వైపు వెళ్లినట్లు గుర్తించి తీసుకోవలసిన చర్యలు గురించి చర్చించారు. ఆర్డీఓ ఎ కుమార్, ఎసిపి రామచంద్ర రావు, తహసీల్దార్ సుశీలదేవి, మైలవరం సిఐ కె కిషోర్ బాబు, మైలవరం ఫారెస్ట్ రేజర్ ఆఫీసర్ రాధాకుమారి, ర్యాపీడ్ రెస్పాన్స్ అండ్ రెస్క్యూటీం పాల్గొన్నారు.
చిరుతపులి సంచారం
16 నిమిషాల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది నవం 19, 2026, 11:59 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్లు
సంబంధిత వార్తలు






కామెంట్లు (0)