గురువారం, 19 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

మరోసారి తగ్గిన బంగారం ధరలు

1 గంట క్రితం

down
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 19, 2026, 10:41 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

- ఒక్కరోజే రూ.2,570 తగ్గిన పసిడి.. వెండిపై రూ.5 వేల పతనం

వెబ్ న్యూస్: బంగారం, వెండి కొనుగోలుదారులకు కీలక అప్‌డేట్. దేశీయ మార్కెట్లో గురువారం బంగారం, వెండి ధరలు స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల పెంపుపై చేసిన సంకేతాలు, డాలర్ విలువ పెరగడం, అమెరికా ట్రెజరీ బాండ్ల రాబడులు పెరగడం పసిడి ధరలపై ప్రభావం చూపుతున్నాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర ఏకంగా రూ.2,570 తగ్గి రూ.1,30,690కి చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.2,350 తగ్గి రూ.1,19,800గా నమోదైంది. ఇక వెండి ధర కూడా భారీగా పడిపోయింది. కిలో వెండి ధర మరోసారి రూ.5,000 తగ్గడంతో రూ.1,80,000కు దిగివచ్చింది. దీంతో బంగారం, వెండి కొనుగోలుదారులకు కొంత ఊరట లభించింది. అంతర్జాతీయ పరిణామాలు విలువైన లోహాల ధరలపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్