గురువారం, 19 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

యూనస్‌ పూర్వీకుల ఇంటికి నిప్పంటించిన దుండగులు

15 నిమిషాల క్రితం

Yunus.jpg
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 19, 2026, 11:34 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

ఢాకా : బంగ్లాదేశ్‌లో మరోసారి ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. ఆ దేశ మాజీ తాత్కాలిక ప్రభుత్వ ప్రధాన సలహాదారు మహమ్మద్‌ యూనస్‌ నివాసంపై బుధవారం రాత్రి దాడి జరిగింది. చట్టోగ్రామ్‌లోని ఆయన పూర్వీకుల ఇంటికి గుర్తుతెలియని దుండగులు నిప్పంటించారు. ఈ ఇంటి కింది అంతస్తులో ఉన్న ఖాళీ గదిలో మంటలు చెలరేగినట్లు పోలీసులు తెలిపారు. ఇంటి పరిసరాల్లో నిరంతరం గస్తీ నిర్వహిస్తున్న పోలీసులు మంటలను గుర్తించి వెంటనే లోపలికి వెళ్లి అదుపు చేశారు. ఈ ఘటనలో ఎవరెవరు పాల్గొన్నారనే దానిపై దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసు అధికారి (ఓసీ) మొజామ్మెల్‌ తెలిపారు. కింది అంతస్తులో ఎవరూ నివసించడం లేదని, రెండో, మూడో అంతస్తుల్లో యూనస్‌ సోదరుల కుటుంబాలు ఉంటున్నాయని చెప్పారు. ఘటన అనంతరం ఇంటి చుట్టూ భద్రతను మరింత కట్టుదిట్టం చేసినట్లు వెల్లడించారు. బంగ్లాదేశ్‌లో 2024 ఆగస్టులో విద్యార్థుల ఉద్యమంతో షేక్‌ హసీనా ప్రభుత్వం కూలిపోయిన తర్వాత, తాత్కాలిక ప్రభుత్వానికి నాయకత్వం వహించేందుకు యూనస్‌ ప్రధాన సలహాదారుగా బాధ్యతలు చేపట్టిన సంగతి తెలిసిందే.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్