- దొనబండలో విషాదం
ప్రజాశక్తి - ఇబ్రహీంపట్నం : రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి చెందడంతో ఇబ్రహీంపట్నం మండలం దొనబండ గ్రామం శోకసంద్రంలో మునిగిపోయింది. గ్రామానికి చెందిన వేముల సర్వేంద్రరావు (24), బైలా వెంకటేష్ (23) బైక్‌పై ప్రయాణిస్తుండగా గుంటూరు జిల్లా పెదకాకాని వద్ద అదుపుతప్పి ప్రమాదానికి గురై మృతి చెందారు. ఇద్దరు యువకుల అకాల మరణంతో దొనబండ గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. మృతుడు బైలా వెంకటేష్ తండ్రి గతంలోనే మరణించడంతో కుటుంబ బాధ్యతలు అతనిపై పడ్డాయి. తల్లి కుటుంబ పోషణ కోసం వెంకటేష్ సంపాదనపై ఆధారపడి జీవిస్తోంది. కుటుంబానికి అండగా నిలుస్తున్న యువకుడు రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో ఆ తల్లి దిక్కుతోచని స్థితిలో కన్నీరుమున్నీరవుతోంది. చిన్న వయసులోనే ఇద్దరు యువకులు మృతి చెందడం గ్రామస్తులను తీవ్రంగా కలచివేసింది. కుటుంబ సభ్యులు, బంధువులు, గ్రామస్తులు మృతుల కుటుంబాలను పరామర్శిస్తూ కన్నీటి పర్యంతమవుతున్నారు. ఇద్దరు యువకుల మృతి దొనబండ గ్రామంలో తీరని విషాదాన్ని నింపింది.








కామెంట్‌లు (0)