మాచవరం (కోనసీమ) : వచ్చే మార్చి నాటికి రాష్ట్రంలో భూ సమస్యలన్నీ పరిష్కరిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. కోనసీమ జిల్లా పి.గన్నవరం నియోజకవర్గం పరిధి మాచవరంలో ‘మీ భూమి- మీ హక్కు’ కార్యక్రమంలో సిఎం ప్రసంగించారు. గతంలో రెవెన్యూశాఖలో డబ్బులు ఇవ్వకపోతే పని జరగదు అనే అపవాదు ఉందని, ఆ అపవాదును మార్చి ప్రజలకు ఇబ్బంది లేకుండా చూస్తున్నామని అన్నారు. అన్ని సమస్యలు పరిష్కరించి ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూస్తామన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాక.. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌ను రద్దు చేశామని తెలిపారు. గత ప్రభుత్వంలో నేరాలు ఘోరాలు చేశారని ఆరోపించారు. భూములకు భద్రత ఇవ్వడమే కూటమి ప్రభుత్వం అజెండా అని చెప్పారు. పటిష్టంగా రీసర్వే చేసి.. అత్యుత్తమ టెక్నాలజీతో పాస్ పుస్తకాలు ఇస్తున్నామన్నారు. కూటమి ప్రభుత్వం ఇచ్చే పట్టాదారు పాస్‌పుస్తకాలు ఎవరూ మార్చలేరని, ఇప్పటివరకు 36 లక్షల మందికి పాస్ బుక్‌లు ఇచ్చామన్నారు. వచ్చే మార్చి లోపు 56 లక్షల మందికి అందజేస్తామన్నారు. పాలన అంటే సచివాలయంలో ఉండటం కాదనీ, ప్రజల వద్దకు వచ్చి కష్టసుఖాలు తెలుసుకొని పాలసీలు తెచ్చి న్యాయం చేయాలని చెప్పారు. ఓటు వేసి గెలిపించిన ప్రజలతో మాట్లాడేందుకే తన పర్యటనలు అని అన్నారు. పేదల సేవలో పునీతమయ్యేందుకు సూపర్ సిక్స్ సహా సంక్షేమ పథకాలు. ప్రజలంతా గౌరవప్రదంగా జీవించే వరకూ ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. పీ 4 పథకం తెచ్చి పేదలను ఆదుకునే కార్యక్రమం చేపట్టామన్నారు. పిల్లలే సంపద.. పిల్లలు లేకపోతే యంత్రాలకు సేవ చేయాల్సి వస్తుందని చెప్పారు. విలువలతో కూడిన రాజకీయం చేయాలనే ఆలోచనతో ఫ్యామిలీ బిజినెస్ ఏర్పాటు చేశానన్నారు. మూడేళ్ల క్రితం ఇదే రోజు నంద్యాలలో మీటింగ్ నుంచి వస్తుంటే అరెస్ట్ చేశారని గుర్తు చేసుకున్నారు. ఏ కేసులో అరెస్టు చేస్తున్నారని అడిగితే చెప్పలేదని, 53 రోజులు రాజమహేంద్రవరం జైలులో ఉన్నానని, తాను జైలులో ఉన్నప్పుడు పవన్ కల్యాణ్ వస్తే ఇబ్బంది పెట్టారని... ఇబ్బందులను ఎదుర్కొని తనను కలిశారని వివరించారు. కోనసీమ అంటే బాలయోగి గుర్తుకు వస్తారని చెప్పారు. ప్రజల జీవితాలు బాగుపడాలనే సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నామన్నారు నాలుగో శనివారం వస్తే పేదల ఆరోగ్యం గుర్తుకు వస్తుందన్నారు. గత ప్రభుత్వం ప్రజల జీవన విధానాన్ని అస్తవ్యస్థం చేసిందని సిఎం అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు అనగాని సత్యప్రసాద్, అచ్చెన్నాయుడు వాసంశెట్టి సుభాష్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రైతులకు సీఎం చేతులమీదుగా పట్టాదారు పాస్ బుక్‌లు అందజేశారు.
వచ్చే మార్చి నాటికి రాష్ట్రంలో భూ సమస్యలన్నీ పరిష్కరిస్తాం : సిఎం చంద్రబాబు
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది సెప్టెం 09, 2026, 03:34 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు






కామెంట్‌లు (0)