టిడిపి పొలిట్‌బ్యూరో సభ్యులు వర్ల రామయ్య
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : మాజీముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి కుల రాజకీయాలు చేస్తూ సమాజంలో అలజడులు సృష్టించాలని చూస్తున్నారని టిడిపి పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య విమర్శించారు. టిడిపి కార్యాలయంలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రతి విషయాన్ని రాజకీయం చేస్తున్నారని విమర్శించారు. కావాలనే కాపు వర్గాలను రెచ్చగొట్టేందుకు సరికొత్త అబద్ధాల రాజకీయాన్ని జగన్ తెరపైకి తెచ్చారని ఆరోపించారు. ఒక దురదృష్టకర సంఘటనను పట్టుకుని ఆడుతున్న నాటకాలు అసహ్యం కలిగిస్తున్నాయని పేర్కొన్నారు. గాదె సాయికృష్ణ సంఘటనపై అడ్డగోలు అబద్ధాలు చెబుతూ ఎందుకు కాపు వర్గాలను రెచ్చగొడుతున్నారని ప్రశ్నించారు.రాజకీయ లబ్ధి కోసం సమాజంలో కులాల మధ్య చిచ్చు పెట్టాలని చూస్తే ప్రజలు ఊరుకోరని హెచ్చరించారు.
లోకేష్ సవాల్‌కు సమాధానం చెప్పే దమ్ముందా?: జగన్‌కు ఎమ్మెల్సీ రాంగోపాల్ ప్రశ్న
డిఎస్సిపై విద్యాశాఖమంత్రి నారా లోకేష్ విసిరిన సవాల్‌పై చర్చించే దమ్ము ఉందా అని వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిని టిడిపి ఎమ్మెల్సీ రాంగోపాల్ రెడ్డి ప్రశ్నించారు. ఎక్కడ అవినీతి జరిగిందో, ఎక్కడ పారదర్శకత లోపించిందో చర్చిద్దామని తాము పదే పదే సవాల్ చేస్తున్నా వైసిపి నేతలు పారిపోతున్నారని విమర్శించారు. గురువారం గవర్నర్‌కు,శుక్రవారం ఢిల్లీలో ప్రధానికి, కేంద్ర మంత్రులకు ఫిర్యాదులు చేస్తూ డ్రామాలు ఆడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏ అభ్యర్థి పైన అయినా అనుమానాలు ఉంటే లిస్ట్ పట్టుకుని రావాలని, విద్యాశాఖ, క్రీడాశాఖ అధికారులను కూర్చోబెట్టి ప్రతి పాయింట్‌కు సమాధానం చెప్పిస్తామన్నారు.









కామెంట్‌లు (0)