- మాజీ ముఖ్యమంత్రి జగన్
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులపై చంద్రబాబు సర్కారు పాశవిక దాడి అమానుష చర్య అని మాజీ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి విమర్శించారు. ఆదివారం ఆయన ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రభుత్వ ఉద్యోగులపై పోలీసుల లాఠీఛార్జి, అత్యంత తీవ్రమైన విషయమని తెలిపారు. వారి డిమాండ్లపై ప్రభుత్వం చర్చలు జరపనప్పుడు ప్రజాస్వామ్యయుతంగా వారు గొంతును వినిపించడం నేరమెలా అవుతుందని ప్రశ్నించారు. ‘మహిళలని కూడా చూడకుండా ఈడ్చిపారెస్తారా? శాంతియుత ఆందోళనలపై దాడులు చేసే అధికారం మీకెవరిచ్చారు? ధర్నా కోసం వస్తున్న వారిని అడ్డుకుని పోలీసు స్టేషన్‌లో నిర్బంధించి నరకయాతన పెడతారా?’ అంటూ నిలదీశారు.







కామెంట్‌లు (0)