ఒకరు మృతి, పది మందికి గాయాలు
ప్రజాశక్తి-కుప్పం : చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో వైసిపి శ్రేణులపైకి ఎన్నికల రూట్ అధికారి వాహనం దూసుకెళ్లింది. దీంతో ఒకరు మృతిచెందారు. పదిమందికి తీవ్ర గాయాల య్యాయి. వానగుట్టపల్లిలో గెలుపొందిన అనిత మోహన్‌కు డిక్లరేషన్ ఇవ్వకుండా అధికారులను టిడిపి శ్రేణులు అడ్డుకున్నారు. ఎన్నికల రూట్ ఆఫీసర్ కారుపై టిడిపి శ్రేణులు దాడికి పాల్పడ్డాయి. అనంతరం వైసిపి మద్దతుదారులపై కారు వేగంగా పోనివ్వడంతో వైసిపి కార్యకర్త రాజేంద్ర మృతి చెందినట్లు సమాచారం. సుమారు ఒకటిన్నర కిలోమీటరు దూరం ఈడ్చుకెళ్లడంతో రాజేంద్ర మృతిచెందాడు. కుప్పం మండలంలో నాలుగు పంచాయతీలను వైసిపి మద్దతుదారులు కైవసం చేసుకున్నారు. వానగుట్టపల్లి పంచాయతీలో టిడిపి అభ్యర్థిపై వైసిపి మద్దతుదారు అనితమోహన్ 42 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. మహమ్మద్‌పురంలో నాసీర్ 65 ఓట్లు, ఎన్. కొత్తపల్లిలో చంద్రమ్మ 113 ఓట్లు, మోట్లచేనులో సుశీల 279 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు.







కామెంట్‌లు (0)