శుక్రవారం, 18 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

టెట్‌ అర్హత మార్కులు తగ్గించాలి, పరీక్షను ఆఫ్‌లైన్‌లో నిర్వహించాలి: యుటిఎఫ్‌

1 గంట క్రితం

utf
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 18, 2026, 05:02 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి - వీరఘట్టం : టెట్‌ అర్హత మార్కులు తగ్గించాలి, పరీక్షను ఆఫ్‌లైన్‌లో నిర్వహించాలని ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ (యుటిఎఫ్‌) డిమాండ్‌ చేసింది. యుటిఎఫ్‌ వీరఘట్టం మండలశాఖ ఆధ్వర్యంలో శుక్రవారం MPPS, పాపమ్మపేట ,MPPS,బొడ్లపాడు, MPUPS,తూడి , MPUPS, పివిఆర్‌ పురం, MPPS, చిదిమి, MPPS, రాజపురం,MPPS, కె.ఇచ్చాపురం,GTWAHS, గంగమ్మపేట, MPPS,కె.కవిటి, ZPHS,కె. కవిటి, mpps,రేగులపాడు, mpups, హుస్సేనుపురం, తదితర పాఠశాలలను సందర్శించింది. ఈ సందర్భంగా UTF, జిల్లా కార్యదర్శి మజ్జి పైడిరాజు మాట్లాడుతూ... ప్రభుత్వం పిఆర్‌సి కమిటీ నియమించి వెంటనే ఐఆర్‌ ప్రకటించాలని,డిఎ బకాయిలు చెల్లించాలని,సిపిఎస్‌ రద్దు చేయాలని అన్నారు. ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులకు టెట్‌ రద్దు చేయాలని, రద్దు వీలుకాని పక్షంలో అర్హత మార్కులు తగ్గించాలని, పరీక్షను ఆఫ్ లైన్ లోనే నిర్వహించాలని డిమాండ్‌ చేశారు. బోధించే సబ్జెక్స్‌లోనే టెట్‌ను నిర్వహించాలని, యాప్‌లను రద్దు చేసి, బోధనేతర కార్యక్రమాల నుంచి మినహాయించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు బోనంగి దుర్గాప్రసాదరావు, మండల ప్రధానకార్యదర్శి కురమాన గోవిందరావు, మండల గౌరవాధ్యక్షులు అమజూరు స్వామిబాబు,జిల్లా కౌన్సిలర్ అరసాడ చంద్రమోహన్ తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్