ప్రజాశక్తి - ఆలమూరు : ప్రజల చేత ఎన్నుకోబడిన స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల సేవలు ఎనలేనివని ఎంపీడీవో ఏ.రాజు, తహసీల్దార్ కందుల కుశరాజు, జిల్లా గ్రౌండ్ వాటర్ పిడి మండల ప్రత్యేక అధికారి లక్ష్మి ప్రత్యూష, ప్రముఖ నాయకులు కొనియాడారు. మండల పరిషత్ కార్యాలయంలో మాజీ వార్డు మెంబర్లు, మాజీ సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు( కో ఆప్షన్ సభ్యునితో సహా) 22 మందికి, జెడ్పీటీసీ సభ్యులు తోరాటి సీతామహాలక్ష్మి, ఎంపీపీ తోరాటి లక్ష్మణరావులకు శుక్రవారం సత్కారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఇప్పటికే సర్పంచుల పదవీకాలం ముగిసిందని, ఈనెల 24 తో ఎంపీటీసీలు, జడ్పీటీసీల పదవీకాలం ముగియనుందన్నారు. ప్రజా ప్రతినిధుల విధుల్లో సమాజ శ్రేయస్సు, అభివృద్ధి కోసం ప్రజలకు సేవ చేయడం ప్రధానమని అధికారులు తెలిపారు. ప్రజాస్వామ్యంలో ప్రజల అవసరాలను గుర్తించి పరిష్కరించడం, ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడం వారి ముఖ్య బాధ్యతలని పేర్కొన్నారు. మండలంలోని గ్రామాల సమస్యలను పరిష్కరించే దిశగా ప్రజా ప్రతినిధులు పనిచేయాలని సూచించారు. ముఖ్యంగా తాగునీరు, వీధి దీపాలు, రహదారులు, డ్రైనేజీ వంటి ప్రాథమిక వసతుల కల్పనపై దృష్టి సారించాలన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాల ద్వారా అర్హులైన పేదలకు పింఛన్లు, రేషన్ కార్డులు, ఇళ్ల స్థలాలు, ఇతర ప్రయోజనాలు అందేలా చూడాలని తెలిపారు. అలాగే విద్య, వైద్య రంగాల్లో ప్రభుత్వ పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రాలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల నిర్వహణను పర్యవేక్షించడం కూడా ప్రజా ప్రతినిధుల బాధ్యతల్లో భాగమని వివరించారు. ఈ బాధ్యతలను సమర్థంగా నిర్వర్తించే వారికి ప్రజల్లో మంచి గుర్తింపు లభిస్తుందని అధికారులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ కొత్తపల్లి వెంకటలక్ష్మి, ఆలమూరు డిసి చైర్మన్ మెర్ల గోపాలస్వామి, మండల పరిషత్ ఏవో మెహర్ ప్రకాష్, మాజీ సర్పంచులు సంగీత సుభాష్, తమ్మన శ్రీనివాస్, దంగేటి చంద్రకళ, సొసైటీ చైర్మన్లు మేడపాటి రామారెడ్డి, వంటిపల్లి సతీష్ కుమార్, నల్లా వెంకన్న, మాజీ ఏఎంసి చైర్మన్ ఈదల నల్లబాబు, వివిధ శాఖల అధికారులు, కూటమి నాయకులు పాల్గొన్నారు.
ప్రజా ప్రతినిధుల సేవలు ఎనలేనివి
55 నిమిషాల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది సెప్టెం 18, 2026, 05:10 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు






కామెంట్‌లు (0)