శుక్రవారం, 18 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

పౌష్టికాహారంతో వ్యాధులు దూరం : సిడిపిఓ గజలక్ష్మి

44 నిమిషాల క్రితం

aalamuru-3
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 18, 2026, 05:18 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి - ఆలమూరు : పౌష్టికాహారంతో వివిధ వ్యాధులను దూరం చేయవచ్చునని సిడిపిఒ ఏ.గజలక్ష్మి అన్నారు. ఆమె ఆధ్వర్యంలో శుక్రవారం మండల కేంద్రంలోని ఎరుకల కాలనీలో అంగన్వాడీ కేంద్రం పరిధిలో పోషణ్ మహన్ కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా గర్భిణులకు, బాలింతలకు పౌష్టికాహారం పట్ల అవగాహన కల్పించి, ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా సూపర్ వైజర్ నాగలక్ష్మి మాట్లాడుతూ.. నెల రోజులపాటు పోషణ్ పక్వాడా కార్యక్రమాలు జరుగుతాయన్నారు. గర్భస్థ శిశువు నుంచి బిడ్డ పుట్టిన వెయ్యి రోజుల కాలవ్యవధి సంరక్షణ సమయంలో గర్భిణి, శిశువు ఆరోగ్యంగా ఉండడానికి తగిన పౌష్టికాహారం, వైద్యపరీక్షలు, ఐరన్, కాల్షియం, అయోడిన్ సాల్ట్, విటమిన్లు, ఆకు కూరలు, కాయగూరలు, పాలు, గుడ్లు, ఎడబ్ల్యూసిలో ఇస్తున్న 5 రకాల బాలసంజీవినీ కిట్లు తీసుకోవాలన్నారు. రోజూ తినే ఆహారంలో చిరుధాన్యాలు చేర్చుకోవాలని తెలిపారు. ప్రసవ సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ముర్రుపాలు గురించి, 6 నెలలు పాటు తప్పకుండా తల్లి పాలు మాత్రమే ఇవ్వడం వలన కలిగే ప్రయోజనాల గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో ఐసిడిఎస్ సూపర్వైజర్లు నాగ సత్యవేణి, వరలక్ష్మి దేవి, అంగన్వాడీ కార్యకర్తలు, అధికసంఖ్యలో గర్భిణీలు, బాలింతలు పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్