శుక్రవారం, 06 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

ఏలూరులోని కోరుటూరులో పోలింగ్‌ను బహిష్కరించిన గ్రామస్తులు

1 గంట క్రితం

eluru
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 06, 2026, 03:48 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి -జీలుగుమిల్లి : పునరావాస కాలనీల్లో ఉంటున్న నిర్వాసితుల సౌకర్యార్థం కోరుటూరులో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో గాజుల గొంది, టేకూరు, కోరుటూరు పునరావాస కాలనీల గ్రామస్తులు స్థానిక సంస్థల ఎన్నికల పోలింగ్ను బహిష్కరించారు. ఇప్పటి వరకు పి.అంకంపాలెం పంచాయతీలో కలిపి ఉండటంతో తమ గ్రామాలను ప్రజాప్రతినిధులు పట్టించుకోవడం లేదని, అదే విధంగా గ్రామాల అభివృద్ధి జరగట్లేదని ఆవేదన వ్యక్తం చేశారు. గాజుల గొంది, టేకూరు, కోరుటూరు మూడు గ్రామాలు కలిపి పంచాయతీ చేయాలని, ఎన్నికల్లో తమకు అవకాశాలు కల్పించాలని గ్రామస్తులు ముక్తకంఠంతో కోరారు. విషయమై అసిస్టెంట్ కలెక్టర్ శ్రావణ్ కుమార్, ఆర్డీఓ ఎం వి రమణ, స్థానిక రిటర్నింగ్ అధికారి సాయి బుచ్చారావు, తహశీల్దార్ వెంకటేశ్వరరావు, పోలింగ్ అధికారి కె. శ్రీనివాస్‌లు గ్రామస్తులతో మాట్లాడిన ఫలితం లేకపోయింది.



eluru-1


జీలుగుమిల్లి మండలంలోని ఇతర గ్రామాల్లో పోలింగ్ వివరాలు

ఈ విధంగా ఉన్నాయి.

మొత్తం ఓట్లు = 25713


పురుషులు = 7065


స్త్రీలు = 7977


ఇతరులు = 01


మొత్తం = 15043


పర్సంటేజ్ = 58.5%

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్