శుక్రవారం, 06 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

బాపట్లలో దెబ్బతిన్న నల్లమడ కాల్వను పరిశీలించిన సీఎం

1 గంట క్రితం

ap cm
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 06, 2026, 03:45 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

బాపట్ల జిల్లాలో పంట కాల్వల నష్టంపై అధికారులతో సమీక్ష
ప్రజాశక్తి - బాపట్ల : మురసు తుపాను కారణంగా కురిసిన అతి భారీ వర్షాలతో దెబ్బతిన్న పంట కాల్వలను రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శుక్రవారం పరిశీలించారు. బాపట్ల జిల్లాకు చేరుకున్న ఆయన నల్లమడ కాల్వను సందర్శించి తుపాను కారణంగా జరిగిన నష్టాన్ని పరిశీలించారు. పంట కాల్వలకు జరిగిన నష్టానికి సంబంధించిన ఫొటో ఎగ్జిబిషన్‌ను తిలకించారు. జలవనరుల శాఖ ఇంజినీరింగ్‌ అధికారులతో మాట్లాడి కాల్వల నష్టం వివరాలు, పునరుద్ధరణ చర్యల గురించి అడిగి తెలుసుకున్నారు. ముఖ్యమంత్రి వెంట జిల్లా ఇన్‌చార్జి మంత్రి, సమాచార పౌర సంబంధాలు, గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి, బాపట్ల ఎంపీ తెన్నేటి కృష్ణప్రసాద్‌, బాపట్ల ఎమ్మెల్యే వేగేశన నరేంద్రవర్మ, పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు ఉన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్