ప్రజాశక్తి - అమరావతి బ్యూరో : ఆంధ్రప్రదేశ్ విలేజ్ రెవెన్యూ ఆఫీసర్స్ అసోసియేషన్ 2026–2029 కాలానికి నూతన రాష్ట్ర కార్యవర్గం శుక్రవారం ఏకగ్రీవంగా ఎన్నికైంది. విజయవాడలోని రెవెన్యూ భవన్‌లో శుక్రవారం నిర్వహించిన ఎన్నికల్లో రాష్ట్రంలో వివిధ జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో విఆర్ఓలు హాజరై నూతన రాష్ట్ర కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ అనుబంధంగా ఉన్న ఈ సంఘానికి అధ్యక్షులుగా కోన ఆంజనేయ కుమార్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఎం.బాపూజీ, సహ అధ్యక్షులుగా టి.శ్రీనివాసరావు, ఉపాధ్యక్షులుగా జి. అనుపమ, ప్రచార కార్యదర్శిగా జి. దిల్లేశ్వరరావు, ఆర్గనైజింగ్ సెక్రటరీగా కె.సాహితి ఎన్నికయ్యారు. ఎపి రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు శ్చేబ్రోలు కృష్ణమూర్తి ఎన్నికల అధికారిగా వ్యవహరించారు. అనంతరం బొప్పరాజు వెంకటేశ్వర్లు వారిని అభినందించి మాట్లాడారు. విఆర్‌ఓ అసోసియేషన్ బలోపేతానికి ఏపి రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ ఎల్లప్పుడూ ముందుంటుందని అన్నారు. రెవెన్యూ పరిపాలనలో మండల స్థాయిలో తహసీల్దార్ పాత్ర ఎంత కీలకమో, గ్రామ స్థాయిలో ప్రభుత్వ సేవలను ప్రజలకు చేరువ చేయడంలో విఆర్ఓల పాత్ర కూడా అంతే ముఖ్యమని తెలిపారు. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజలు ప్రభుత్వ సేవల్లో మరింత పారదర్శకత, వేగవంతమైన సేవలు, సమర్థవంతమైన పరిష్కారాలను ఆశిస్తున్నారని, అందుకు అనుగుణంగా విఆర్‌ఓలు అంకితభావంతో పనిచేయాలని ఆయన సూచించారు.
విఆర్ఓల సంఘం నూతన కార్యవర్గం ఎన్నిక
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది అక్టో 02, 2026, 09:41 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు






కామెంట్‌లు (0)