75 ఏళ్ల వృద్ధుడితో 30 ఏళ్ల మహిళ నిశ్చితార్థం.. త్వరలో వివాహం
లక్నో : ప్రేమకు వయసుతో సంబంధం లేదని చెబుతుంటారు. ఉత్తరప్రదేశ్లో చోటుచేసుకున్న ఓ ఘటన ఇప్పుడు ఈ మాటను మరోసారి చర్చలోకి తెచ్చింది. 30 ఏళ్ల మహిళ, 75 ఏళ్ల వృద్ధుడితో ప్రేమలో పడటమే కాకుండా, ఆయనను వివాహం చేసుకోవాలని నిర్ణయించుకుంది. ఇప్పటికే వీరిద్దరి నిశ్చితార్థం ఘనంగా జరగ్గా, త్వరలోనే పెళ్లి చేసుకునేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.
ఉత్తరప్రదేశ్లోని ఔరైయా జిల్లాకు చెందిన రీనా (30) సోషల్ మీడియా కంటెంట్ క్రియేటర్గా గుర్తింపు పొందింది. ఏడాది క్రితం ఆమెకు 75 ఏళ్ల రామ్ సాగర్తో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం క్రమంగా ప్రేమగా మారడంతో ఇద్దరూ కలిసి జీవితాన్ని కొనసాగించాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో ఇటీవల కుటుంబ సభ్యులు, ఇతరుల సమక్షంలో వీరి నిశ్చితార్థం జరిగినట్లు సమాచారం. దసరా నవరాత్రుల అనంతరం వివాహం చేసుకునేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది.
తన నిర్ణయంపై స్పందించిన రీనా.. రామ్ సాగర్తో తనకు 45 ఏళ్ల వయస్సు వ్యత్యాసం ఉన్నప్పటికీ, అది తమ బంధానికి అడ్డంకి కాదని స్పష్టం చేసింది. ఆయనను వివాహం చేసుకోవాలన్న తన నిర్ణయం పట్ల తాను సంతోషంగా ఉన్నానని తెలిపింది. వయస్సు తేడా తమ ప్రేమకు సమస్య కాదని పేర్కొంది. ఇదిలా ఉండగా ... వీరిద్దరి నిశ్చితార్థానికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. భారీ వయస్సు వ్యత్యాసంతో ఒక్కటవ్వాలని నిర్ణయించుకున్న ఈ జంట గురించి నెటిజన్లు విభిన్న అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. దీంతో రీనా, రామ్ సాగర్ల ప్రేమకథ ప్రస్తుతం ఆన్లైన్లో చర్చనీయాంశంగా మారింది.








కామెంట్లు (0)