ఆదివారం, 18 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

అలిగిన టిడిపి పట్టణ అధ్యక్షుడు.. పార్టీకి పదవికి రాజీనామా

1 గంట క్రితం

TDP town president, feeling aggrieved, resigns from the party and his post.
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 18, 2026, 04:21 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

  • చైర్పర్సన్ రెబల్ అభ్యర్థిగా మరదలితో నామినేషన్


గుంతకల్లు (అనంతపురం) : టిడిపి పట్టణ అధ్యక్షుడు ముక్కన్నగారి గుణశేఖర్ పార్టీ అధిష్టానం పై అలిగి పార్టీకి పదవికి రాజీనామా చేస్తున్నట్లు ఆదివారం విలేకరుల సమావేశంలో తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ .... స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా మున్సిపాలిటీ చైర్ పర్సన్ అభ్యర్థిగా టిడిపి పట్టణ అధ్యక్షుడు ముక్కన్నగారి గుణశేఖర్ మరదలు బోయ రాజేశ్వర్ కి ఎమ్మెల్యే ఆశీస్సులతో టిడిపి సీటు దాదాపుగా ఖరార్ అయింది అన్నారు. పట్టణంలో ఓటర్లు తన మరదలు రాజేశ్వర్ కి సహకరించాలని ప్రచారం కూడా చేసుకున్నానన్నారు. అయితే అనూహ్యంగా మాజీ ఎమ్మెల్యే జితేంద్ర గౌడ్ అన్న కొడుకు పవన్ కుమార్ గౌడ్ భార్య యశోద పేరును ఖరారు చేస్తూ అధిష్టానం శనివారం సాయంత్రం రెండో విడత జాబితాలో విడుదల చేసిందన్నారు. టిడిపి పార్టీ ఆవిర్భావం నుండి తన తండ్రి ముక్కన్న పార్టీకి విశేష సేవలు అందించాలన్నారు. గౌడు ఫ్యామిలీకి కూడా అనేక సేవలు చేశాడన్నారు. ఆ కృతజ్ఞత మరిచిపోయి తన కుటుంబానికి వచ్చిన చైర్పర్సన్ స్థానాన్ని వారికి తెచ్చుకోవడం బాధగా ఉందన్నారు. అందుకే పార్టీకి అధ్యక్ష పదవికి రాజీనామా చేసి తన తండ్రి ఫోటోతో పాటు చంద్రబాబు నాయుడు ఫోటో పెట్టుకుని ప్రజల్లోకి వెళతానని అన్నారు. అందుకోసమే టిడిపి రెబల్ గా తన మరదలు చేత నామినేషన్ వేయించాను అన్నారు. గౌడ్ ఫ్యామిలీది ఎమ్మెల్యే స్థాయి అని అలాంటిది చైర్మన్ స్థానంపై రాజకీయం చేసి తమకు అన్యాయం చేయడం కాదన్నారు. తనకు జరిగిన అన్యాయాన్ని ప్రజలకు తెలియజేస్తూ ఎన్నికలకు వెళతామని ఆయన అన్నారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్