- సిఇసి, ఎస్ఇసి నియామక వ్యవస్థలో మార్పు రావాలి
ప్రజాశక్తి - అమరావతి బ్యూరో : ప్రధాన ఎన్నికల కమిషనర్ (సిఇసి) నియామకంలో మార్పులకు గతంలో మద్దతిచ్చి తప్పు చేశామని వైసిపి అధినేత వైఎస్ జగన్ మోహన్రెడ్డి అన్నారు. తాడేపల్లిలో ఆదివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘రాష్ట్ర ఎన్నికల కమిషనర్ కానీ, కేంద్ర ఎన్నికల కమిషనర్ కానీ అధికార పార్టీలు నామినేట్ చేసే పరిస్థితి రాకూడదు. ఇలా కేంద్రంలో అధికార పార్టీ నామినేట్ చేసే ప్రక్రియకు అప్పట్లో మద్దతిచ్చి తప్పు చేశాం. ఎందుకంటే విద్యార్థులు ఎగ్జామినర్ను నియమించకూడదు.
ఎగ్జామినర్ ఎంత నిజాయితీపరుడైనా విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుంది. న్యూట్రల్ బాడీ మళ్లీ రావాలి. ప్రతిపక్షనేత, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, ప్రధాని ముగ్గురూ కలిసి సిఇసిని నియమించాలి. అప్పుడు న్యూట్రల్ బాడీ కింద కనిపిస్తుంది. ఇప్పుడు ప్రధాని, ప్రధాని నామినేట్ చేసే మంత్రి, ప్రతిపక్ష నేత ఉన్నారు. సిజెఐ పక్కకి వెళ్లిపోయారు. ఇద్దరి ఓట్లు ఒకరికే పడతాయి కాబట్టి ప్రభుత్వం నామినేట్ చేసినట్టే. ఇది వ్యవస్థలో ఉన్న లోపం. కేంద్రంలో, రాష్ట్రాల్లో ఈ పరిస్థితి మారేవరకూ వ్యవస్థ బాగుపడదు. మేము కూడా తప్పులు చేసిన తరువాతే గ్రహించాం.’ అని అన్నారు.








కామెంట్లు (0)