శుక్రవారం, 13 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

రసగుల్లా అని చీకట్లో బాంబును చేతికిస్తే .. నోట్లో కొరికి వ్యక్తి మృతి

13 నిమిషాల క్రితం

A man died after biting into an object handed to him in the dark which turned out to be a bomb not the rasgulla he had expected
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 13, 2026, 10:51 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

భోపాల్ (మధ్యప్రదేశ్) : రసగుల్లా అని బాంబు చేతికిస్తే చీకట్లో తెలియక నోట్లో కొరికి.. వ్యక్తి మరణించిన ఘటన మధ్యప్రదేశ్లోని డిండౌరీ జిల్లా పడరియా గ్రామంలో జరిగింది. గత మంగళవారం రాత్రి రాజేంద్ర బరోటియా (35) తన ఇంట్లో ఉండగా బంధువైన రామ్భగత్ బరోటియా వచ్చాడు. కాసేపు మాట్లాడిన తరువాత రసగుల్లా అంటూ ... నాటుబాంబును రాజేంద్ర చేతికి ఇవ్వగా.. చీకట్లో సరిగా కనిపించక రాజేంద్ర దానిని నోట్లో పెట్టుకొని కొరికాడు. వెంటనే భయంకరమైన పేలుడుతో నోరంతా రక్తమోడుతూ కుప్పకూలి మృతి చెందాడు. "అది జంతువులను చంపేందుకు వాడే నాటుబాంబు. పేలుడు శబ్దం వినగానే పరుగున వచ్చి ఆటోరిక్షాలో ఆయనను ఆసుపత్రికి తరలించినా ప్రయోజనం లేకపోయింది” అని రాజేంద్ర భార్య సుశీలా బాయి తెలిపారు. నిందితుడు రామ్భగత్ ను అరెస్టు చేసినట్లు కొత్వాలీ పోలీస్ స్టేషను ఇన్ఛార్జి దుర్గాప్రసాద్ నాగ్పురె తెలిపారు. ఈ ఘటన వెనుక వ్యక్తిగత కక్షలు ఏమైనా ఉన్నాయా అనే కోణంలోనూ విచారణ చేపట్టామన్నారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్