ప్రజాశక్తి - ఎఎన్‌యు : ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం దూరవిద్య కేంద్రం ఆధ్వర్యంలో ఈ నెల 20వ తేదీన నిర్వహించిన ఎంబీఏ, ఎంసీఏ ఉమ్మడి ప్రవేశ పరీక్ష ఫలితాలను విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య కంచర్ల గంగాధరరావు, రెక్టార్ ఆచార్య ఆర్. శివరాం ప్రసాద్, రిజిస్ట్రార్ ఆచార్య జి. సింహాచలం బుధవారం విడుదల చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 14 పరీక్ష కేంద్రాలలో జరిగిన ఉమ్మడి ప్రవేశ పరీక్షలో ఎంబీఏ కోర్స్ లో 684 మంది, ఎంసీఏ లో 97 మంది ఉత్తీర్ణత సాధించారని దూరవిద్య కేంద్రం డైరెక్టర్ ఆచార్య వంకాయలపాటి వెంకటేశ్వర్లు, పరీక్షల కోఆర్డినేటర్ ఆచార్య దిట్టకవి. రామచంద్రన్ లు తెలిపారు. కార్యక్రమంలో వర్సిటీ దూరవిద్య కేంద్రం పరీక్షల విభాగం అసిస్టెంట్ రిజిస్ట్రార్ కృష్ణవేణి, సూపర్డెంట్ జవ్వాజి శ్రీనివాసరావు, ఐసిటి డివిజన్ డైరెక్టర్ ప్రభాకర్, సీనియర్ అసిస్టెంట్ మురళీకృష్ణ పాల్గొన్నారు.
ఎఎన్‌యు దూరవిద్య ఎంబిఎ, ఎంసిఎ ఉమ్మడి ప్రవేశ పరీక్ష ఫలితాల విడుదల
4 రోజుల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది సెప్టెం 23, 2026, 08:59 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)