బుధవారం, 23 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

సాయికుమార్‌‌కు మంత్రి సవిత అభినందన

1 గంట క్రితం

సాయికుమార్‌‌కు మంత్రి సవిత అభినందన image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 23, 2026, 09:42 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో

మార్కాపురంలో ఇటీవల జరిగిన 11వ ఎపి స్టేట్ సబ్ జూనియర్స్ బాల్ బ్యాడ్మింటన్ పోటీల్లో బెస్ట్ ప్లేయర్ అవార్డుతో పాటు మూడో ప్లేస్ సాధించి.. రాష్ట్రం నుంచి జాతీయ పోటీలకు ఎంపికైన వినుకొండ ఎంజెపి బిసి గురుకుల పాఠశాల విద్యార్థి దేవళ్ల సాయికుమార్‌ను బిసి సంక్షేమశాఖ మంత్రి ఎస్ సవిత అభినందించారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో మంత్రి సవితను వినుకొండ ఎంజెపి బిసి గురుకుల విద్యార్థి, బ్యాడ్మింటన్ క్రీడాకారుడు సాయికుమార్, కోచ్ జూనా నాయక్, ప్రిన్సిపల్ వై రమేష్‌ బుధవారం మర్యాదపూర్వకంగా కలిశారు. బాల్ బ్యాడ్మింటన్‌లో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో కూడా రాణించి రాష్ట్రానికి పేరు ప్రఖ్యాతలు తీసుకురావాలని ఆమె ఆకాంక్షించారు. వచ్చే నెల మూడో తేదీ నుంచి చత్తీగఢ్‌లో జరిగే జాతీయ సబ్ జూనియర్స్ పోటీల్లో రాష్ట్రం తరపున పాల్గొననున్నట్లు తెలిపారు. అనంతరం సాయికుమార్‌ను సత్కరించారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్