బుధవారం, 23 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

రాష్ర్టంలో ఆదిత్య బిర్లా హౌసింగ్ 16 శాఖలకు విస్తరణ

1 గంట క్రితం

vzm
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 23, 2026, 10:28 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

విజయవాడ : ఆదిత్య బిర్లా హౌసింగ్ ఫైనాన్స్ విజయనగరంలో కొత్త శాఖను ప్రారంభించింది. దీంతో ఆంధ్రప్రదేశ్‌లో సంస్థ శాఖల సంఖ్య 16కు చేరిందని ఆ కంపెనీ ఓ ప్రకటనలో తెలిపింది. గృహ రుణాలు, ఆస్తిపై రుణాలు వంటి సేవలను అందించనున్నట్లు వెల్లడించింది. నూతన ఈ శాఖలో అక్టోబర్ 17 వరకు ఎలాంటి ప్రాసెసింగ్‌ ‌ఫీజు లేకుండా రూ.50 లక్షల వరకు తక్షణ రుణ మంజూరు ఆఫర్‌ను అందిస్తున్నామని ఆ సంస్థ ఎండి, సిఇఒ పంకజ్ గాడ్గిల్ పేర్కొన్నారు. ఖాతాదారులు సొంతింటి కలను నేరవేర్చుకోవాలనే ప్రక్రియను మరింత సరళంగా, సులభంగా చేయడమే తమ లక్ష్యమన్నారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్