బుధవారం, 23 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

సామ్‌‌సంగ్‌ దిగుమతి సుంకాల ఎగవేత..!

1 గంట క్రితం

lg
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 23, 2026, 10:33 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

- ఎల్‌‌జి కూడా తప్పుడు క్లెయిమ్‌లు

- డిఆర్‌ఐ దర్యాప్తు

న్యూఢిల్లీ : అత్యాధునిక ఒఎల్‌ఇడి టివిల తయారీలో వినియోగించే డిస్‌ప్లే విడిభాగాల దిగుమతిలో సామ్‌‌సంగ్‌, ఎల్‌‌జి కంపెనీలు అక్రమాలకు పాల్పడ్డాయని తెలుస్తోంది. ఈ ఉత్పత్తుల దిగుమతులపై తక్కువ సుంకాలు చెల్లించాయని రిపోర్టులు వస్తోన్నాయి. ఈ వ్యవహారంలో సామ్‌‌సంగ్‌, ఎల్‌జి సంస్థలపై డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డిఆర్‌ఐ) దర్యాప్తు చేపట్టింది. పాత తరహా ఎల్‌సిడి, ఎల్‌ఇడి డిస్‌ప్లే స్క్రీన్‌ల ఓపెన్ సెల్స్‌ దిగుమతులపై అమలవుతున్న 5 శాతం రాయితీ సుంకాన్ని.. ఒఎల్‌ఇడి విడిభాగాల దిగుమతికి కూడా ఈ కంపెనీలు తప్పుగా క్లెయిమ్ చేశాయని రిపోర్టులు వస్తోన్నాయి. వాస్తవానికి వీటికి 15 శాతం సుంకం చెల్లించాల్సి ఉంటుందని అధికారులు పేర్కొంటున్నారు. ఈ దర్యాప్తులో భాగంగా గుర్‌‌గావ్‌‌లోని సామ్‌‌సంగ్‌ ప్రధాన కార్యాలయంలో అధికారుల విచారణ జరిపారు. మరోవైపు ఎల్‌‌జి అదనపు సుంకం కింద కొంత మొత్తాన్ని స్వచ్ఛందంగా డిపాజిట్ చేసినట్లు సమాచారం. ఈ ‌విచారణలో తాము అధికారులతో పూర్తిగా సహకరిస్తున్నామని, అన్ని చట్టాలకు కట్టుబడి ఉంటామని సామ్‌‌సంగ్‌ పేర్కొంది.

ఒఎల్‌ఇడి విడిభాగాలపై ఈ కంపెనీలు 15 శాతం సుంకం చెల్లించాల్సి ఉంటుందని డిఆర్‌ఐ అధికారులు తెలిపారు. అయితే ఈ సుంకం ఎగవేతకు సంబంధించి ఆర్థిక వివరాలను సదరు వర్గాలు వెల్లడించలేదు. సాధారణంగా ఇలాంటి దర్యాప్తుల అనంతరం పన్ను చెల్లింపు నోటీసులు జారీ చేయడంతో పాటు ఎగవేసిన సుంమానికి సమానంగా 100 శాతం వరకు జరిమానాలు విధించే అవకాశం ఉంటుంది. ఈ నోటీసులను కంపెనీలు న్యాయపరంగా సవాలు చేసే వెసులుబాటు ఉంది. ఈ దర్యాప్తులు జరుగుతున్న తరుణంలోనే.. ఒఎల్‌ఇడి డిస్‌ప్లే విడిభాగాలపై కూడా 5 శాతం రాయితీ సుంకం వర్తింపజేయాలని కోరుతూ ఆగస్టులో పరిశ్రమ సంఘాలు ఐటి మంత్రిత్వ శాఖను కోరడం విశేషం.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్