సోమవారం, 28 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

కెజిబివిలో నియామకంలో థర్డ్‌ పార్టీ వద్దు

3 రోజుల క్రితం

imb
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 24, 2026, 10:06 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

- సమగ్రశిక్షా కాంట్రాక్టు, ఔట్‌‌సోర్సింగ్‌ ఎంప్లాయిస్‌ ఫెడరేషన్‌

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : సమగ్రశిక్ష ఆధ్వర్యంలో కెజిబివిలలో బోధనేతర పోస్టుల నియామకాన్ని థర్ద్‌ ‌పార్టీ ఏజెన్సీకి అప్పగించొద్దని ఎపి సమగ్రశిక్షా కాంట్రాక్టు అండ్‌ ఔట్‌‌సోర్సింగ్‌ ఎంప్లాయిస్‌ ఫెడరేషన్‌ ‌కోరింది. ఈ మేరకు సమగ్రశిక్ష డైరెక్టర్‌ ‌బి శ్రీనివాసరావుకు ఫెడరేషన్ చైర్మన్‌ ‌బి కాంతారావు, ప్రధాన కార్యదర్శి యు కళ్యాణి గురువారం రాసిన లేఖను మీడియాకు విడుదల చేశారు. కెజిబివి టైప్‌-3,4 పాఠశాలలు, రాష్ట్ర కార్యాలయంలో కలిపి మొత్తం 1,110 నాన్‌ ‌టీచింగ్‌ ‌పోస్టుల భర్తీకోసం జారీ చేసిన ప్రైవేట్‌ ‌టెండర్‌ అభ్యంతరకరమని తెలిపారు. గతంలో జారీ చేసిన నోటిఫికేషన్‌‌ ప్రకారం అభ్యర్ధుల ఎంపిక జాబితాను ప్రభుత్వ అధికారిక సంస్థ అయిన ఆప్కాస్‌‌లో నమోదు చేయాలని, వేతనాలు కూడా ఈ నిబంధనల ప్రకారమే చెల్లించాలని నిబంధనలు ఉన్నాయని తెలిపారు. పారదర్శక, రాజ్యాంగబద్ధమైన నియమాలను విస్మరించి, ప్రైవేట్‌ ‌థర్డ్‌ ‌పార్టీ ఏజెన్సీలను ప్రోత్సాహించడం సరికాదని పేర్కొన్నారు. దీనివల్ల ఇప్పటికే సేవలందిస్తున్న కార్మికులకు, అర్హులైన నిరుద్యోగ మహిళలకు తీరని అన్యాయం జరుగుతోందని తెలిపారు. ప్రైవేట్‌ ఏజెన్సీలు కమీషన్ల కోసం కొత్తవారిని తీసుకొచ్చి ఇప్పటికే పనిచేస్తున్న నిరుపేద మహిళలను అర్ధంతరంగా రోడ్డున పడేసే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. క్షేత్రస్థాయిలో ఏళ్ల తరబడి సేవలందించిన అనుభవాన్ని పరిగణనలోకి తీసుకుని ప్రస్తుతం పనిచేస్తున్న డైలీ వేజ్‌ ‌సిబ్బందిని ముందుగా అధికారిక ఔట్‌‌సోర్సింగ్‌ ‌విధానంలోకి గుర్తించి బదలాయించాలని కోరారు. మిగిలిన ఖాళీలలో మాత్రమే నూతన నియామకాలు చేపట్టాలని తెలిపారు. పాత నోటిఫికేషన్‌‌లోని సెక్షన్‌-2 ప్రకారం ప్రతి పోస్టుకు రోస్టర్‌ ‌పాయింట్లు కొనసాగిస్తూ పక్కాగా అమలు చేయాలని స్పష్టమైన ఆదేశౄలు ఇచ్చారని పేర్కొన్నారు. ప్రస్తుత ప్రైవేట్‌ ‌టెండర్‌‌లో వీటిని పూర్తిగా తొలగించారని వివరించారు. ప్రైవేట్‌ ఏజెన్సీలకు పూర్తి అధికారం ఇవ్వడం వల్ల సామాజిక న్యాయం పూర్తిగా గల్లంతవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఆప్కాస్‌ ‌ద్వారా ఉద్యోగిపై 1శాతం సర్వీస్‌ ‌చార్జీ ఉంటే, ప్రస్తుత టెండర్‌ ‌ద్వారా 3శాతం కట్టబెట్టేలా నిబంధనలు మార్చారని ఇది ప్రైవేట్‌ ‌దోపిడీకి, ఉద్యోగాల క్రయవిక్రయాలకు దారితీస్తుందని పేర్కొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్