ప్రజాశక్తి - యు.కొత్తపల్లి : వాయుగుండం తీరం దాటినప్పటికీ ఉప్పాడ సముద్ర తీరం మాత్రం ఇంకా ఉగ్రరూపాన్ని ప్రదర్శిస్తుంది. శుక్రవారం భారీ అలలు ఎగిసిపడుతూ తీరాన్ని తాకడంతో స్థానికులు, వాహనదారులు భయాందోళనకు గురయ్యారు. ఉప్పాడ–కాకినాడ బీచ్ రోడ్డులోని చిన్న వంతెన వద్ద రాకాసి అలలు ఉవ్వెత్తున ఎగిసి రోడ్డుపైకి దూసుకొస్తున్నాయి. ఈ మార్గంలో నిత్యం బస్సులు, ఆటోలు, ద్విచక్ర వాహనాలు, ఇతర వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి. సముద్ర అలలు ఒక్కసారిగా రోడ్డుపైకి దూసుకురావడంతో వాహనదారులు భయాందోళనకు గురయ్యారు. ముఖ్యంగా చిన్న వంతెన వద్ద అలల తాకిడి ఎక్కువగా ఉండటంతో విద్యార్థులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరోవైపు అలల ఉద్ధృతి పెరగడంతో తీర ప్రాంత గ్రామాలైన సుబ్బంపేట, పల్లిపేట, రంగంపేట వాసుల్లో ఆందోళన నెలకొంది. సముద్రం మరింత ముందుకు చొచ్చుకొస్తుందేమోనన్న భయం గుప్పెట్లో కాలం వెళ్లదీస్తున్నారు. అధికారులు పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించి, బీచ్ రోడ్డులో ప్రయాణించే వాహనదారులు, విద్యార్థుల భద్రతకు తగిన చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.
ఉప్పాడ తీరంలో రాకాసి అలలు
16 గంటల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది సెప్టెం 25, 2026, 05:06 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)