శనివారం, 03 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

సిఇసి జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలి...

6 గంటల క్రితం

సిఇసి జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలి image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 03, 2026, 09:49 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి - తెనాలి : సర్ పేరుతో ప్రజాస్వామ్యంపై జరుగుతున్న దాడిని ఖండించాలని, కేంద్ర ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలని సిపిఎం తెనాలి ఏరియా కార్యదర్శి కె బాబు ప్రసాద్ డిమాండ్ చేశారు. కేంద్రంలోని బిజెపి సర్కార్ కు తొత్తుగా వ్యవహరిస్తూ సర్ పేరుతో 13 కోట్ల మంది ఓట్లను తొలగించిన సిఇసి వైఖరిని నిరసిస్తూ వామపక్షాల ఆధ్వర్యంలో శనివారం మున్సిపల్ మార్కెట్ ప్రాంగణంలోని మహాత్మా గాంధీ విగ్రహం వద్ద నిరసన వ్యక్తం చేశారు. ఓట్ల చోరీకి కేంద్రానికి సహకరించిన సిఈసి రాజీనామా చేయాలని, తొలగించిన 13 కోట్ల ఓట్లను పునరుద్ధరించాలని, ప్రజాస్వామ్యంపై జరుగుతున్న దాడిని అరికట్టాలని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా బాబు ప్రసాద్ మాట్లాడుతూ బిజెపి అధికారంలోకి రావడానికి వ్యతిరేక ఓట్లను తొలగించేందుకు 'సర్' పేరిట పన్నిన కుట్రలో సీఈసీ భాగస్వామిగా ఉండటం దురదృష్టకరమన్నారు. తక్షణమే జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. సిపిఐ (ఎంఎల్) నాయకులు ఎం.ఫణి రాందేవ్, సిపిఎం నాయకులు ములకా శివ సాంబిరెడ్డి మాట్లాడారు. కార్యక్రమంలో సిఐటియు నాయకులు షేక్ హుస్సేన్ వలి, రిటైర్డ్ ఆర్టీసీ ఎంప్లాయిస్ నాయకులు సుబ్రమణ్యం, లోకం సాంబశివరావు, పి.జయ వెంకటేష్, ఎం.సోమశేఖర్, శ్రీరామ్, జి.సాంబశివరావు, పి.కోటేశ్వరరావు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్