- 7 కార్పొరేషన్లు, 29 మున్సిపాల్టీలకు అభ్యర్థుల ప్రకటన
- రేపటితో ముగియనున్న నామినేషన్లు, పెండింగ్లో 4 కార్పొరేషన్లు, 49 మున్సిపాల్టీలు
- ఆశావహుల్లో ఆందోళన
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : స్థానిక సంస్థల ఎన్నికల్లో విశాఖపట్నం నుంచి మేయర్ అభ్యర్థిగా ముక్క శ్రావణిని టిడిపి బరిలో దింపింది. తొలిదశలో 7 కార్పొరేషన్లకు, 29 మున్సిపాల్టీ, నగర పంచాయతీల అభ్యర్థుల జాబితాను శుక్రవారం రాత్రి ప్రకటించింది. చిత్తూరు మేయర్గా కటారి హేమలతను, కడప మేయర్ అభ్యర్థిగా నెల్లటూరి సువర్ణ, కర్నూలు అభ్యర్థిగా విజయ ప్రత్యూష, నెల్లూరుకు పోలబోయిన రూప్కుమార్, తిరుపతికి మన్నెం శ్రీనివాస ప్రసాద్, విజయనగరం అభ్యర్థిగా అవనపు భార్గవిని ప్రకటించింది. వీటితో పాటు 29 మున్సిపాల్టీ, నగర పంచాయతీల అభ్యర్థులను టిడిపి ప్రకటించింది. వారి ఎంపికపై టిడిపి అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శుక్రవారం విస్తృత కసరత్తు చేశారు. ఆయా పట్టణాలు, నగరాలకు సమర్ధంగా నాయకత్వం వహించగల వారిని గుర్తించేందుకు అన్ని అంశాలనూ నిశితంగా పరిశీలించినట్లు టిడిపి కార్యాలయం ఒక ప్రకటనలో వెల్లడించింది. పార్టీ కోసం నిరంతరం శ్రమించిన వారి కృషికి గుర్తింపునిస్తూ అవకాశాలు కల్పించినట్లు తెలిపింది. ఆదివారంతో నామినేషన్ల ప్రక్రియ ముగియనుంది. అయినా టిడిపి ఇంకా పూర్తిస్థాయిలో అభ్యర్థులను ఖరారు చేయకపోవడంతో ఆశావహుల్లో ఆందోళన నెలకొంది. ఇంకా నాలుగు కార్పొరేషన్లకు, 49 మున్సిపాలిటీ, నగర పంచాయతీలకు అభ్యర్థులను టిడిపి ప్రకటించాల్సి వుంది. మరోవైపు జనసేన, బిజెపి కూడా తన అభ్యర్థులను వెల్లడించాల్సి ఉంది.
మున్సిపాల్టీ, నగర పంచాయతీ అభ్యర్థులు
1. ఆళ్లగడ్డ - అనీషా షేక్
2. అద్దంకి - కాకాని అశోక్
3. ఆదోని - నాగమణి
4. ఆత్మకూరు (నంద్యాల) - గోవింద్ రాజులు
5. బద్వేలు - సోమశిల దివ్య తేజ
6. బొబ్బిలి - రాంబార్కి రేణుకా దేవి స్వప్న
7. దాచేపల్లి - తంగెళ్ల శ్రీనివాసరావు
8. ధర్మవరం - పరిశె సుధాకర్
9. గురజాల - నెలవల్లి బొల్లయ్య
10. హిందూపురం - పి.ఎస్. మంజునాథ్
11. ఇచ్ఛాపురం - ఆసి లీలా రాణి
12. జగ్గయ్యపేట - నరేంద్రుల వినీత
13. జమ్మలమడుగు - జ్యోతి చాడిప్రళ్ల
14. కమలాపురం - గొంగలిరెడ్డి స్వప్న
15. కుప్పం - ఎస్. రాజకుమార్
16. మాచర్ల - ఏనుముల సుష్మ
17. మదనపల్లె - శ్రీరామ్ చిన్న బాబు
18. మార్కాపురం - వక్కలగడ్డ మల్లికార్జున
19. నగరి - శ్రీనివాసన్
20. పలాస కాశీబుగ్గ - వజ్జ గంగాభవాని
21. పెద్దాపురం - వత్సవాయి ఎల్.ఎస్.ఎన్. రాజు
22. పెనుకొండ - త్రివేంద్ర మూర్తి
23. పులివెందుల - తుగుట్ల గీతా కుమారి
24. రాజంపేట - దొంతం గాయత్రి
25. రామచంద్రపురం - మేడిశెట్టి శేషారావు
26. రాయచోటి - ఖాదర్ వలి షేక్
27. రాయదుర్గం - టంకశాల హనుమంతు
28. రేపల్లె - కె. అపర్ణ
29. సూళ్లూరుపేట - పి. సుహాసిని








కామెంట్లు (0)