బుధవారం, 25 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionకరువు, తుపాను సహాయక చర్యల మాటేమిటి?

25 నిమిషాల క్రితం

ap koulu rythusangam
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 25, 2026, 09:12 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

  • ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : రాష్ట్రంలో తుపాన్లు, కరువు వల్ల నష్టపోయిన రైతులకు ఇన్‌‌పుట్‌ సబ్సిడీ, పంట నష్టపరిహారం, పంటల బీమా పరిహారం ఎప్పుడు అందజేస్తారు, ఎంత చెల్లిస్తారనే అంశంపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వకపోవడం శోచనీయమని ఆంధ్రప్రదేశ్‌ ‌రైతు సంఘం రాష్ట్ర కమిటీ పేర్కొంది. తక్షణమే పరిహారం చెల్లించి రైతులను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని ఆ సంఘం రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు వి.కృష్ణయ్య, కె.ప్రభాకర్‌ ‌రెడ్డి బుధవారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. అధికారుల అంచనా ప్రకారమే 26 జిల్లాలలో సుమారు 32 లక్షల ఎకరాల్లో కరువు, తుఫాన్ ల వల్ల పంటలు దెబ్బతిన్నాయని, వాటికి అందించే ఇన్పుట్ సబ్సిడీ రూ.2,743 కోట్లు అవుతుందని అధికారులు పేర్కొన్నారని, దీని ప్రకారం ఎకరాకు సగటున 8,707 రూపాయలు ఇన్పుట్ సబ్సిడీగా రైతుకు అందుతుంది. పంటల బీమా విధానంలో ప్రభుత్వం తెచ్చిన ఐచ్చిక పంటల భీమా కారణంగా మొత్తం రాష్ట్రంలో 29 లక్షల ఎకరాలు మాత్రమే పంటల బీమా క్రింద నమోదయింది. మరో 30 లక్షల ఎకరాలకు పైగా పంటల బీమా కింద నమోదు కాలేదన్నారు. అధికారుల అంచనా ప్రకారం రూ.1,732 కోట్లు పంటల బీమా పరిహారంగా వస్తుంది. అంటే సగటున ఎకరాకు రూ.5,972 బీమా పరిహారంగా రైతులు పొందే అవకాశం ఉందని తెలిపారు. ప్రభుత్వం తన విధానాన్ని సమీక్షించుకొని ఉచిత పంటల భీమా విధానాన్ని అమలు చేయాలని కోరారు. ప్రభుత్వం సగటున ఎకరాకు ఆహార పంటలకు 25 వేల రూపాయలు, వాణిజ్య, ఉద్యాన పంటలకు 50 వేల రూపాయలు ఇన్పుట్ సబ్సిడీ, పంటల బీమా ద్వారా రైతుకు దక్కేలాగా విధానం రూపొందించాలన్నారు. రాయలసీమను హార్టికల్చర్ హబ్ అభివృద్ధిలో రాష్ట్ర ప్రభుత్వ పాత్ర ఏమిటో స్పష్టత లేదన్నారు. ప్రకృతి వ్యవసాయం పేరుతో రైతులకు అవసరమైన రసాయనిక ఎరువుల సరఫరాను కుదించి రైతులకు ఇబ్బంది కలిగించకుండా సమన్వయంతో సమతుల్యతను పాటించాలని ప్రభుత్వాన్ని కోరారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్