- ప్రభుత్వం కసరత్తు
ప్రజాశక్తి - అమరావతి బ్యూరో : అమరావతి రాజధాని నగరంలో విద్యుత్ సరఫరా ఎలా ఉండాలనే అంశంపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. దీనికోసం నివేదిక తయారీలో ఆనుభవం ఉన్న సంస్థల నుండి ఆసక్తి వ్యక్తీకరణ టెండర్లను ఎపిసిఆర్‌డిఏ కోరింది. రిటైల్ సరఫరా లైసెన్స్ ఆధారిత పంపిణీనా, లేదా ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్యమా (పిపిపి), జాయింట్ వెంచరా (జెవి), రాయితీనా అనే అంశాలను నిర్ణయించేందుకు అవసరమైన ప్రణాళికను రూపొందించేందుకు అనుభవం ఉన్న సంస్థల నుండి టెండర్లను ఆహ్వానించింది. డిస్ట్రిబ్యూషన్ నెట్‌వర్కు ఎలా ఉండాలనే దానిపైనా అంచనాలు రూపొందిస్తోంది. 2047 నాటికి ఇక్కడ కోటీ 40 లక్షల మంది ఉంటారని, నగరం 20 లక్షల జనాభాకు చేరుకుంటుందని అంచనా వేశారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థలో దాదాపు 28 శాతం వాటాను కలిగి ఉంటుందని లెక్కగట్టారు. 22 బిలియన్ అమెరికన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మారుతోందని అంచనా వేసినట్లు పేర్కొన్నారు. దీంతోపాటు డిజిటల్‌గానూ ఈ నగరం ముందుంటుందని, ఈ నేపథ్యంలో విద్యుత్ సరఫరా అనేది అత్యంత కీలకం కానుందని పేర్కొన్నారు. ఎపిసిఆర్‌డిఏ విద్యుత్ పంపిణీ, నెట్‌వర్క్ అభివృద్ధి, నిర్వహణ, స్మార్ట్ గ్రిడ్ సిస్టమ్స్, వినియోగదారుల సేవా నిర్వహణ, బిల్లింగ్ వసూలు చేసేందుకు అలవసరమైన ప్రణాళిక రూపొందించేందుకు అనుభవం ఉన్న జాతీయ, అంతర్జాతీయ సంస్థల నుండి నివేదిక తయారు చేయించాలని నిర్ణయించారు.







కామెంట్‌లు (0)