బుధవారం, 16 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

కలెక్టరేట్‌ ఉద్యోగి ఆత్మహత్య

1 గంట క్రితం

suicide
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 16, 2026, 07:15 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

– ఈపురుపాలెంలోని ఇందిరానగర్‌లో ఘటన

– కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు

ప్రజాశక్తి - చీరాల : ఒంగోలు కలెక్టరేట్‌లో అటెండర్‌గా పనిచేస్తున్న ఓ ఉద్యోగి ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన విషాద ఘటన మంగళవారం చీరాల మండలం ఈపురుపాలెంలోని ఇందిరానగర్‌ కాలనీలో చోటుచేసుకుంది.అందిన వివరాల మేరకు.. ఈపురుపాలెంలో నివాసం ఉంటున్న గంజి పుండరీనాథ్‌ వెంకటేష్‌ (25) ప్రకాశం జిల్లా కలెక్టరేట్‌లో అటెండర్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. మంగళవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు సమాచారం. కుటుంబ సభ్యులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న ఈపురుపాలెం పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. కుటుంబ సభ్యుల నుంచి వివరాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం చీరాల ఏరియా వైద్యశాలకు తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పుండరీనాథ్‌ ఆత్మహత్యకు దారితీసిన కారణాలపై పోలీసులు విచారణ చేస్తున్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్