బుధవారం, 16 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

పొగ హెచ్చరికతో ఇండిగో విమానం మళ్లింపు

1 గంట క్రితం

indigo
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 16, 2026, 07:41 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

- ప్రయాణికులు సేఫ్

లక్నో: విమానం కార్గో ప్రాంతంలో పొగకు సంబంధించిన హెచ్చరిక రావడంతో అగర్తలా నుంచి ఢిల్లీ వెళ్తున్న ఇండిగో విమానాన్ని లక్నోకు మళ్లించారు. మంగళవారం సాయంత్రం ఈ ఘటన చోటుచేసుకుంది. ఇండిగోకు చెందిన 6E6504 విమానంలో 103 మంది ప్రయాణికులు, ఆరుగురు సిబ్బంది ఉన్నారు. పొగ హెచ్చరిక నేపథ్యంలో విమానాన్ని లక్నోలోని చౌదరి చరణ్ సింగ్ అంతర్జాతీయ విమానాశ్రయానికి మళ్లించారు. విమానం సాయంత్రం 6:29 గంటలకు సురక్షితంగా ల్యాండ్ అయిందని విమానాశ్రయ అధికారులు తెలిపారు. విమానం ల్యాండింగ్‌కు ముందే లక్నో విమానాశ్రయంలో అత్యవసర ప్రతిస్పందన చర్యలను అధికారులు చేపట్టారు. అగ్నిమాపక, రెస్క్యూ బృందాలతో పాటు అంబులెన్స్‌లు, టెర్మినల్ సహాయక సిబ్బందిని సిద్ధంగా ఉంచారు.

విమానం, ప్రయాణికులు, సిబ్బంది భద్రతను నిర్ధారించేందుకు అన్ని ముందస్తు చర్యలు తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ ఘటనలో ఎలాంటి గాయాలు లేదా అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోలేదని స్పష్టం చేశారు. కార్గో ప్రాంతంలో పొగ హెచ్చరికకు గల కారణాలపై సంబంధిత అధికారులు తదుపరి తనిఖీలు చేపట్టారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్