- వైరల్‌గా మారిన ఫొటోలు
దక్షిణ భారత సినీ పరిశ్రమలో అభిమానుల మనసులు గెలుచుకున్న స్టార్ కపుల్ సూర్య, జ్యోతిక మరోసారి పెళ్లి దుస్తుల్లో కనిపించి సందడి చేశారు. తమ 20వ వివాహ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ఈ జంట మళ్లీ పెళ్లి చేసుకున్నట్టుగా కనిపిస్తున్న ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ సందర్భంగా జ్యోతిక తమ వైవాహిక జీవితంలోని అనుభవాలను గుర్తు చేసుకుంటూ భావోద్వేగభరితమైన పోస్ట్‌ను పంచుకున్నారు. తమది ఎలాంటి ‘పర్ఫెక్ట్’ మ్యారేజ్ కాదని, అసంపూర్ణతలు, సర్దుబాట్లు, పరస్పర అవగాహన, త్యాగాలతో సాగిన నిస్వార్థమైన ప్రేమ ప్రయాణమని ఆమె పేర్కొన్నారు.
“ఎప్పటికీ నిజమవుతుందని నేను అనుకోని ఒక కల.. ఈ రోజు ఒక అందమైన వాస్తవంగా మారింది. నా జీవితాంతం దీనితోనే ఉండాలనుకుంటున్నాను. భర్తగా, నా పిల్లల తండ్రిగా ఉన్న సూర్య రూపంలో నాకు మరో మంచి స్నేహితుడు దొరకడం నా అదృష్టం” అంటూ జ్యోతిక రాసుకొచ్చారు. జీవితంలో గొడవలు, రాజీలు సహజమేనని చెబుతూ.. ప్రతిరోజూ ఒకరినొకరు మరింతగా అర్థం చేసుకుంటూ, దగ్గరవుతూ సాగుతున్న తమ బంధాన్ని ఆమె గుర్తుచేసుకున్నారు. “గొడవపడి, మళ్లీ రాజీపడి, ప్రతిరోజూ మరింత దగ్గరవుతూ ఉండే ఆ అసంపూర్ణమైన భాగస్వామిగానే నేను కొనసాగుతాను” అనే భావంతో తన నోట్‌ను ముగించారు.
సూర్య, జ్యోతిక పెళ్లి దుస్తుల్లో ఉన్న ఈ ఫొటోలు అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. 20 ఏళ్ల వైవాహిక ప్రయాణాన్ని ఇలా ప్రత్యేకంగా సెలబ్రేట్ చేసుకోవడంపై అభిమానులు సోషల్ మీడియా వేదికగా ప్రేమ, శుభాకాంక్షలు కురిపిస్తున్నారు.







కామెంట్‌లు (0)