న్యూఢిల్లీ: గత ఏడాదితో పోలిస్తే ఆగస్టులో భారతదేశ ఎగుమతులు 25.41 శాతం పెరిగాయి. ఆగస్టులో 8268 కోట్ల డాలర్ల ఎగుమతులు జరిగాయి. గత ఏడాది ఆగస్టులో మొత్తం ఎగుమతులు 6593 కోట్ల డాలర్లుగా ఉన్నాయి. దీంతో వాణిజ్య లోటు 941 బిలియన్ డాలర్లకు తగ్గింది. గత ఆగస్టులో వాణిజ్య లోటు 1162 కోట్ల డాలర్లుగా ఉంది.
దిగుమతులలో కూడా పెరుగుదల కనిపించింది. ఆగస్టులో 9209 కోట్ల డాలర్ల దిగుమతులు జరిగాయి. గత ఏడాది ఆగస్టులో దిగుమతుల విలువ 7755 కోట్ల డాలర్లుగా ఉంది. వస్తు ఎగుమతుల్లో 26.12 శాతం పెరుగుదల నమోదైంది. గత ఆగస్టులో 3474 మిలియన్ డాలర్లుగా ఉన్న ఎగుమతులు, ఈ ఆగస్టులో 4381 మిలియన్ డాలర్లకు పెరిగాయి.







కామెంట్‌లు (0)