మంగళవారం, 20 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

స్థానిక ఎన్నికల వేళ ... పార్టీ ఆదేశాలను ధిక్కరిస్తే చర్యలు తప్పవు : సిఎం చంద్రబాబు

10 గంటల క్రితం

With local elections approaching... defying party directives will lead to disciplinary action: CM Chandrababu
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 20, 2026, 01:50 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

అమరావతి : స్థానిక ఎన్నికల్లో పార్టీ ఆదేశాలను ధిక్కరించి రెబల్స్ ‌గా బరిలో నిలిస్తే చర్యలు తప్పవని టిడిపి అధినేత, సిఎం చంద్రబాబు హెచ్చరించారు. రెబల్స్‌గా నామినేషన్లు వేసిన వారితో ఉపసంహరింపజేయాలని, పార్టీ అధికారిక అభ్యర్థుల విజయానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని స్పష్టం చేశారు. పార్టీ నేతలతో చంద్రబాబు మంగళవారం టెలికాన్ఫరెన్స్‌ నిర్వహించారు. కూటమి పార్టీల మధ్య సమన్వయంతోనే అభ్యర్థుల ఎంపిక, ప్రచారం జరగాలని నేతలకు దిశానిర్దేశం చేశారు. తాత్కాలిక ప్రయోజనాల కోసం అభ్యర్థులను నిలబెట్టడం సరికాదని, కూటమి కేటాయించిన స్థానాల్లో సమర్థులను గెలిపించుకోవాల్సిందేనని తేల్చిచెప్పారు. ఇంటింటి ప్రచారం నిర్వహిస్తూ ప్రభుత్వం అమలు చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించాలని సూచించారు. సార్వత్రిక ఎన్నికల కంటే మెరుగైన ఫలితాలు సాధించాలని చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. 11 కార్పొరేషన్లను 11 సామాజిక వర్గాలకు కేటాయించామని, అన్ని కులాలకు రాజ్యాధికారంలో భాగస్వామ్యం కల్పించడమే తమ ఉద్దేశమని తెలిపారు. పార్టీ కోసం పనిచేసిన వేలాది మంది కార్యకర్తలకు స్థానిక ఎన్నికల్లో పదవులు దక్కే అవకాశం ఉందని, పొత్తులు, సమీకరణాల వల్ల సీట్లు దక్కని వారికి నామినేటెడ్ పదవుల్లో అవకాశం కల్పిస్తామని హామీ ఇచ్చారు.



ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్