మంగళవారం, 20 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

నామినేషన్ తిరస్కరణపై హైకోర్టును ఆశ్రయించిన వైసీపీ అభ్యర్థి

4 గంటల క్రితం

ycp.jpg
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 20, 2026, 07:52 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి-నగరి : నగరి మున్సిపల్ ఎన్నికల్లో తన నామినేషన్‌ను అధికారులు అన్యాయంగా తిరస్కరించారంటూ వైసీపీ అభ్యర్థి పి. బాలకృష్ణన్ హైకోర్టును ఆశ్రయించారు. అత్యవసర విచారణ కోసం హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. తన నామినేషన్ సక్రమంగా ఉందని రిటర్నింగ్ అధికారి తొలుత ఆమోదించి, లిఖితపూర్వక డిక్లరేషన్ కూడా జారీ చేశారని పిటిషన్‌లో పేర్కొన్నారు. అనంతరం అదే నామినేషన్‌ను తిరస్కరించడం అధికారుల ఏకపక్ష వైఖరికి నిదర్శనమని తెలిపారు. తొలుత జారీ చేసిన ఆమోద డిక్లరేషన్‌ను పరిగణనలోకి తీసుకుని, తన నామినేషన్‌ను చట్టబద్ధంగా ఆమోదించేలా ఆదేశాలు ఇవ్వాలని హైకోర్టును కోరారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్