మంగళవారం, 20 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

సానుభూతి కోసం దాడి చేయించుకునే కుట్ర: ఎమ్మెల్యే పులివర్తి నాని

4 గంటల క్రితం

nani
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 20, 2026, 07:33 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి–తిరుపతి (మంగళం): చంద్రగిరి నియోజకవర్గంలో కుట్రపూరిత రాజకీయాలు చేస్తూ మళ్ళీ తనపై దాడి చేయించుకుని సానుభూతి పొందాలని మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కుట్ర పన్నుతున్నారని, ఈ ట్రాప్ లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పడోద్దని చంద్రగిరి నియోజకవర్గ శాసనసభ్యులు పులివర్తి నాని అన్నారు. మంగళవారం తిరుపతి ప్రెస్ క్లబ్ లో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. 2021లో ఎటువంటి తీర్మానాలు లేకనే పంచాయతీలను అడ్డగోలుగా విభజించారని, అన్ని పదవులు తన కుటుంబానికి కట్టబెట్టుకుంటూ, నమ్ముకున్న వారిని మోసం చేసిన వ్యక్తి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అన్నారు. పారదర్శకమైన పద్ధతుల్లో ఎన్నికలు జరుగుతున్న సమయంలో చంద్రగిరి నియోజకవర్గంలో సృష్టించాలని పక్కనున్న తమిళనాడు ప్రాంతాల నుండి రౌడీ మూకాలను ముందే తరలించి నామినేషన్ ప్రక్రియలో ఉత్కంఠ పరిస్థితులను సృష్టించాలనే కుట్ర చేస్తున్నారని, పోలీసు అధికారులను ఏకపక్షంగా దూషిస్తున్న పరిస్థితులపై పోలీస్ అధికారుల సంఘం కేసులు నమోదు చేయాలని కోరారు. 2024 మే 14న తనపై జరిగిన హత్యకు సంబంధించిన కీలక ఆధారాలను ఇప్పటికీ పోలీసు అధికారులకు ఇవ్వలేదని అన్నారు. సానుభూతి కోసం దాడులు చేయించే కుట్రలో కార్యకర్తలను బలి పశువులను చేస్తున్నారని, తాను రక్షణ పొందడానికి బుల్లెట్టు ప్రూఫ్ వాహనాన్ని తెప్పించుకున్నారన్నారు. ఎమ్మెల్యేగా గెలిపించిన సొంత పార్టీ కార్యకర్తలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో వెన్ను దన్నుగా నిలవాల్సిన అవసరం ఉందని, ఎన్నికల్లో ఎటువంటి కుట్రలు జరగకుండా చంద్రగిరి నియోజకవర్గ అభివృద్ధికి తాను కృషి చేస్తున్నట్లు ఎమ్మెల్యే చెప్పారు. గత వైసిపి హాయంలో పోలీసు ఉన్నతాధికారులను, ఐఏఎస్ అధికారులను సంత స్వలాభాల కోసం వినియోగించుకొని పోస్టింగులు లేకుండా ఇబ్బందులకు గురి చేస్తే తమ ప్రభుత్వం వారికి నేడు పోస్టింగులు ఇచ్చిందని గుర్తు చేశారు. పోలీసు అధికారులపై నిందారోపణలు చేయడం మంచి పద్ధతి కాదని, స్థానిక సంస్థల ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరగడానికి అందరూ సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్