హర్మన్‌ప్రీత్ కౌర్ (91), షఫాలీ వర్మ (69) మెరుపులు
రాయ్‌పూర్: జింబాబ్వే మహిళల జట్టుతో జరుగుతున్న మూడో టీ20 మ్యాచ్‌లో భారత మహిళల జట్టు భారీ స్కోరు సాధించింది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 216 పరుగులు చేసింది. భారత బ్యాటర్లలో హర్మన్‌ప్రీత్ కౌర్ 91 పరుగులతో చెలరేగగా, షఫాలీ వర్మ 69 పరుగులతో అర్ధ సెంచరీ సాధించింది. అనుష్క శర్మ 28 పరుగులు చేసింది. నికి ప్రసాద్ 9, రిచా ఘోష్ 1, దీప్తి శర్మ 0, అరుంధతి రెడ్డి 4, ప్రేమ రావత్ 4 పరుగులు చేశారు. జింబాబ్వే బౌలర్లలో బెలవ్డ్ బిజా 3 వికెట్లు పడగొట్టగా నోంవెలో సిబందా, తెండాయ్ మకుషా, న్యాషా గ్వాంజురా తలో వికెట్ పడగొట్టారు. భారత బ్యాటర్లు రాణించడంతో జింబాబ్వే ముందు భారత్ 217 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది.






కామెంట్‌లు (0)