పది మందికి గాయాలు
ప్రజాశక్తి-చీమకుర్తి: చీమకుర్తి తూర్పు బైపాస్ రోడ్డు ప్రాంతంలో మంగళవారం ఆటో బోల్తా పడిన ప్రమాదంలో పది మంది గాయపడ్డారు. ఒంగోలు నుంచి కనిగిరికి 25 మందితో వెళ్తున్న ఆటో తూర్పు బైపాస్ రోడ్డు వద్దకు చేరుకోగానే అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో పది మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు.





కామెంట్‌లు (0)