mh ad
శుక్రవారం, 19 జూన్ 2026E-PAPER
మ్యాగజైన్స్

రాజకీయ పార్టీలు, న్యాయవాదులకూ పోష్‌ చట్టం విస్తరణ

25 మే, 2026

women commission
వెబ్ డెస్క్

ప్రచురించబడింది మే 26, 2026, 12:13 పూర్వాహ్నం | 2 నిమిషాల చదవడం

ప్రజాశక్తి- మంగళగిరి రూరల్‌ (గుంటూరు జిల్లా) : పని ప్రదేశాల్లో మహిళలపై లైంగిక వేధింపులను నివారించేందుకు అమలులో ఉన్న పోష్‌ (‌ప్రివెన్షన్‌ ఆఫ్‌ ‌సెక్సువల్‌ ‌హెరాస్‌‌మెంట్‌) చట్టాన్ని రాజకీయ పార్టీలకు, న్యాయవాదుల వృత్తిలోని వారికి కూడా విస్తరించే దిశగా ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ చర్యలు ప్రారంభించిం. ఈ అంశంపై సోమవారం గుంటూరు జిల్లా మంగళగిరి సమీపంలోని ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ కార్యాలయంలో విస్తృత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించింది. దీనికి వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు, బార్ అసోసియేషన్ సభ్యులు, బార్ కౌన్సిల్ ప్రతినిధులు హాజరై ఈ చట్టం అమలు విధానంపై తమ అభిప్రాయాలు, సూచనలు తెలియజేశారు. సమావేశానికి అధ్యక్షత వహించిన ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ చైర్‌పర్సన్ డాక్టర్ రాయపాటి శైలజ మాట్లాడుతూ మహిళల భద్రత, గౌరవ పరిరక్షణ ప్రతి వ్యవస్థ బాధ్యతన్నారు. ప్రస్తుతం కార్యాలయాలు, ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల్లో అమలులో ఉన్న పోష్‌ చట్టాన్ని రాజకీయ వ్యవస్థలు, న్యాయవాద వృత్తిలోని వారికీ వర్తింపజేయాల్సిన అవసరం ఉందని తెలిపారు. రాజకీయ పార్టీల్లో పనిచేసే మహిళలు, న్యాయవాద వృత్తిలో ఉన్న మహిళలు ఎదుర్కొనే సమస్యలను దృష్టిలో పెట్టుకుని ఈ చట్ట విస్తరణపై చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. ఈ మేరకు ప్రభుత్వానికి సవరణ ప్రతిపాదించి, అసెంబ్లీలో ప్రవేశపెట్టేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. దేశంలోనే తొలిసారిగా మన రాష్ట్రం ఈ విధానానికి శ్రీకారం చుడుతోందన్నారు. మహిళలకు భయరహిత వాతావరణం కల్పించడంలో ఈ నిర్ణయం కీలక మైలురాయిగా నిలుస్తుందని పేర్కొన్నారు. సమావేశంలో ఆంధ్రప్రదేశ్ బార్ కౌన్సిల్ సభ్యులు రాజేంద్రప్రసాద్, సుప్రీంకోర్టు న్యాయవాది నర్రా శ్రీనివాసరావు, ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ లీగల్ అడ్వైజర్ రావూరి సూయజ్, టిడిపి అధికార ప్రతినిధి యార్లగడ్డ సుచిత్ర, సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు డి.రమాదేవి, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఎవి.నాగేశ్వరరావు, సిపిఐ నాయకులు దుర్గాభవాని, జనసేన పార్టీ ప్రతినిధి శిరీష, బిజెపి రాష్ట్ర నాయకులు నాగమల్లేశ్వరి, కాంగ్రెస్ పార్టీ నాయకులు వరలక్ష్మి, ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు గోపాలకృష్ణమూర్తి, హరికృష్ణ, న్యాయవాదులు జగదీశ్వరి, విజయలక్ష్మి, అరుణ, భవాని తదితరులు పాల్గొన్నారు. వైసిపి మినహా మిగిలిన అన్ని రాజకీయ పార్టీలు పోష్‌ చట్ట విస్తరణకు తమ మద్దతు ప్రకటిం‌చినట్లు కమిషన్‌ ‌తెలిపింది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్