ప్రజాశక్తి -కలెక్టరేట్ (విశాఖపట్నం)
80వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని సిఐటియు అఖిల భారత కమిటీ పిలుపులో భాగంగా ఆ సంఘం జగదాంబ జోన్ కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం విశాఖలోని జివిఎంసి గాంధీ విగ్రహం వద్ద సమైక్యతా దినం నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘం జిల్లా నాయకులు ఎం సుబ్బారావు, వై రాజు, నరసింగరావు, గణేష్, శ్రీను మాట్లాడుతూ మోడీ నేతృత్వంలోని ప్రస్తుత ఎన్‌డిఎ ప్రభుత్వం రాజకీయ ప్రయోజనాల కోసం మతం పేరుతో ప్రజల మధ్య విభజన సృష్టిస్తోందని, ప్రజలకిచ్చిన హామీలను అమలు చేయకుండా మోసగిస్తోందని దుయ్యబట్టారు. దేశ ప్రయోజనాల కంటే అమెరికా సామ్రాజ్యవాద శక్తుల ప్రయోజనాలకు అనుకూలంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. దేశంలోని అన్ని రంగాల్లో అవినీతి, కుంభకోణాలు పెరిగిపోతున్నాయని, పరీక్షా పత్రాల లీకేజీలు, ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ వంటి చర్యలు ప్రజా ప్రయోజనాలకు విరుద్ధంగా ఉన్నాయని అన్నారు. అదాని, అంబాని వంటి కార్పొరేట్ సంస్థల ప్రయోజనాలకు ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని, దేశ సహజ వనరులను కార్పొరేట్ సంస్థలకు అప్పగించే విధానాలను అనుసరిస్తోందని తెలిపారు. నిరుద్యోగ సమస్యను పరిష్కరించడం లేదన్నారు. ప్రభుత్వ విధానాలను ప్రశ్నించవారిపై ఉపా వంటి కఠిన చట్టాలను ప్రయోగించడం ద్వారా ప్రజాస్వామ్య హక్కులను కాలరాస్తున్నారని తెలిపారు. కార్మికుల హక్కులకు భంగం కలిగించేలా తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడ్‌లను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ ‘సమైక్యతా దినం’లో భాగంగా భారతదేశంలోని భిన్నత్వంలో ఏకత్వాన్ని ప్రతిబింబించే బ్యానర్లు, ఫ్లకార్డులను సిఐటియు నాయకులు, కార్యకర్తలు ప్రదర్శించారు. మతం, కులం, ప్రాంతం, భాషకు అతీతంగా ప్రజలంతా ఐక్యంగా ఉండాలనే సందేశాన్ని కార్యక్రమం ద్వారా తెలియజెప్పారు. ప్రజల ఐక్యతను ప్రతిబింబించేలా హిందూ, ముస్లిం, క్రైస్తవ సంప్రదాయాలు ఉట్టిపడే వస్త్రధారణతో కార్యక్రమంలో పాల్గొన్నారు. స్వాతంత్ర్యోద్యమ స్ఫూర్తితో ప్రజా ఐక్యతను కాపాడుకోవాల్సిన అవసరం ఉందని చాటిచెప్పారు.
సిఐటియు ఆధ్వర్యాన సమైక్యతా దినం
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది ఆగ 15, 2026, 01:17 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు






కామెంట్‌లు (0)