ప్రజాశక్తి - అమరావతి బ్యూరో : మాజీ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డిని సిపిఐ నాయకులు గురువారం తాడేపల్లిలోని వైసిపి కేంద్ర కార్యాలయంలో కలిశారు. పలు అంశాలపై కొద్దిసేపు చర్చించారు. జగన్‌ను కలిసిన వారిలో సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి.ఈశ్వరయ్య, జాతీయ కార్యవర్గ సభ్యులు అక్కినేని వనజ, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు పి.హరినాథరెడ్డి ఉన్నారు. ఈ సమావేశంలో వైయస్సార్‌సీపీ స్టేట్ కో-ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి కూడా పాల్గొన్నారు. సిపిఐ నాయకత్వానికి జగన్ స్వాగతం పలికారు. రాష్ట్రంలో నెలకొన్న కరువు పరిస్థితుల నేపథ్యంలో ఈనెల 26న విజయవాడలో ఏర్పాటు చేసిన రౌండ్ టేబుల్ సమావేశానికి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని ఆహ్వానించినట్లు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి జి.ఈశ్వరయ్య తెలిపారు.
సిపిఎం నేతలను కలిసిన సిపిఐ ప్రతినిధి బృందం
రౌండ్ టేబుల్ సమావేశానికి ఆహ్వానం
రాష్ట్రంలో నెలకొన్న తీవ్ర కరవు పరిస్థితుల నేపథ్యంలో సిపిఐ ఆధ్వర్యంలో ఈ నెల 26న విజయవాడలో నిర్వహించనున్న అఖిలపక్ష రౌండ్ టేబుల్ సమావేశానికి హాజరు కావాల్సిందిగా సిపిఎంను ఆ పార్టీ ఆహ్వానించింది. విజయవాడలోని సిపిఎం రాష్ట్ర కార్యాలయానికి చేరుకున్న సిపిఐ జాతీయ _కార్యదర్శి కె. రామకృష్ణ, రాష్ట్ర _కార్యదర్శి జి.ఈశ్వరయ్య, కార్యదర్శివర్గ సభ్యులు పి.హరినాథ్‌రెడ్డి, అక్కినేని వనజతో కూడిన ప్రతినిధి బృందం, సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు లోకనాథం, డి.రమాదేవి, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు వై.వెంకటేశ్వర రావు, బి.బలరామ్‌లను గురువారం కలిసినట్లు వెల్లడించింది. రౌండ్ టేబుల్ సమావేశానికి సంబంధించిన ఆహ్వానాన్ని అందజేసినట్లు తెలిపింది.







కామెంట్‌లు (0)