ప్రజాశక్తి - యంత్రాంగం : రాష్ట్రంలో ఇటీవల జరిగిన మున్సిపల్, పరిషత్ ఎన్నికల్లో జరిగిన అక్రమాలపై సిపిఎం, సిపిఐల అధ్వర్యంలో నేడు రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ఎన్నికల సందర్భంగా టిడిపి కూటమి చేసిన దౌర్జన్యాలను, అధికార దుర్వినియోగాన్ని ప్రశ్నించారు.
స్థానిక ఎన్నికల్లో అధికార కూటమి దాడులు అక్రమాలను ఖండించండి.. ప్రజాస్వామ్యాన్ని కాపాడదాం. కూటమి ప్రభుత్వ దౌర్జన్యాలను అడ్డుకుందామని బాపట్ల పాత బస్టాండ్ లో బుధవారం సిపిఎం సిపిఐ పార్టీల ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించారు.
స్థానిక ఎన్నికల్లో అధికార కూటమి అక్రమాలను ఖండించండి
దేవరాపల్లి,స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార కూటమి ప్రభుత్వం సాగించిన అక్రమాలు, ప్రజాస్వామ్య వ్యతిరేక చర్యలను నిరసిస్తూ బుధవారం దేవరాపల్లి సిపిఎం ఆద్వర్యంలో పెద్ద ఎత్తున దర్నా కార్యక్రమం చేపాట్టారు అనంత రం సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు డి వెంకన్న మండల కార్యదర్శి బిటి దొర తది తరులు మాట్లాడారు ఆంధ్ర ప్రదేశ్‌లో ఇటీవల జరిగిన మున్సిపల్, ఎంపీటీసీ, జడ్పీటీసీ తదితర స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార కూటమి ప్రభుత్వం ప్రతిపక్ష పార్టీల పట్ల వ్యవహరించిన తీరు ప్రజాస్వామ్య వ్యవస్థకే మచ్చగా మారిందని విమర్శించారు.ప్రతిపక్ష పార్టీలకు చెందిన అభ్యర్థులు నామినేషన్లు వేయకుండా అడ్డుకోవడం, నామినేషన్ కేంద్రాల్లోకి వెళ్లకుండా భయ భ్రాంతులకు గురిచేయడం, రిటర్నింగ్ అధికారుల చేతుల్లో నుంచి నామినేషన్ పత్రాలను బలవంతంగా లాక్కోవడం వంటి దుర్మార్గపు చర్యలకు పాల్పడ్డారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల ప్రక్రియలో అధికార యంత్రాంగాన్ని దుర్వినియోగం చేస్తూ ప్రతిపక్ష అభ్యర్థులపై దాడులు చేయడం, బెదిరింపులకు పాల్పడడం, విచ్చలవిడిగా డబ్బు, మద్యం పంపిణీ చేయడం, బరితెగించి రిగ్గింగ్‌కు పాల్పడడం వంటి చర్యలు ప్రజాస్వామ్య విలువలను కాలరాయడమేనని అన్నారు. ప్రజల ఓటు హక్కును కాపాడాల్సిన పోలీసులు అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తూ,ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాల్సిన బాధ్యతను విస్మరించడం తీవ్ర ఆందోళన కలిగిస్తోందన్నారు. ఎన్నికలను స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా నిర్వహించాల్సిన ఎన్నికల యంత్రాంగం అధికార పార్టీ ఒత్తిళ్లకు తలొగ్గడం ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టుగా మారిందని తెలిపారు మహాత్మా గాంధీ కలలుగన్న గ్రామ స్వరాజ్యం అంటే ప్రజల భాగస్వామ్యంతో, స్వేచ్ఛగా, పారదర్శకంగా జరిగే ఎన్నికల ద్వారా స్థానిక పాలనను ప్రజలే నిర్ణయించు కోవడం. కానీ నేడు అధికార కూటమి సాగిస్తున్న అక్రమాలు, దౌర్జన్యాలు, ప్రలోభాలు గ్రామ స్వరాజ్య స్ఫూర్తికే విరుద్ధమని అన్నారు.ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే ఇటువంటి చర్యలను ప్రజలు, ప్రజాస్వా మికవాదులు, అన్ని రాజకీయ పార్టీలు తీవ్రంగా ఖండించాలని కోరారు. ఎన్నికల అక్రమాలపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని, భవిష్యత్తులో ఎన్నికలు స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా జరిగేలా ఎన్నికల సంఘం చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిహెచ్ దేముడు లక్షమణ డి శంకర్ కె ఈశ్వరావు జె దేముడు పోతురాజు రామాక్రిష్ణ రవి బి నాగేశ్వరరావు కె రాముడు ఇ గోపాలుడు కె శ్రీను తదితరులు పాల్గొన్నారు
డి వెంకన్న సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గసభ్యులు
స్థానిక ఎన్నికల్లో అక్రమాలపై వామపక్షాల ఆగ్రహం
...ప్రజాస్వామ్య పరిరక్షణ దినం సందర్భంగా కలెక్టరేట్ ఎదుట ధర్నా
...నామినేషన్ల అడ్డగింత, బూత్‌ల ఆక్రమణ ప్రజాస్వామ్యానికే గొడ్డలిపెట్టు
ప్రజాశక్తి-కాకినాడ : స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార కూటమి పాల్పడుతున్న అక్రమాలకు నిరసనగా వామపక్షాల ఆధ్వర్యంలో బుధవారం కాకినాడ జిల్లా కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. రాష్ట్రవ్యాప్తంగా వామపక్షాలు ఇచ్చిన ప్రజాస్వామ్య పరిరక్షణ దినం పిలుపులో భాగంగా నిర్వహించిన ఈ ఆందోళనలో వామపక్ష నాయకులు, ప్రజాసంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి కరణం ప్రసాదరావు, సిపిఐ జిల్లా కార్యదర్శి కె. బోడకొండ, సిపిఐ (ఎంఎల్) న్యూ డెమోక్రసీ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కార్యదర్శి జె. వెంకటేశ్వర్లు తదితరులు మాట్లాడుతూ రాష్ట్రంలో ఇటీవల జరిగిన మున్సిపల్, జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో గతంలో ఎన్నడూ లేని విధంగా అధికార కూటమి అక్రమాలకు పాల్పడిందని విమర్శించారు.
పోలీసు యంత్రాంగాన్ని ఉపయోగించుకుని నామినేషన్లు వేయకుండా అడ్డుకోవడం, ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు రాకుండా బెదిరించడం రాజ్యాంగం కల్పించిన ప్రజాస్వామ్య హక్కులను కాలరాయడమేనని మండిపడ్డారు. బెదిరింపుల ద్వారా ఏకగ్రీవాలు సాధించడమేనా ప్రభుత్వ పనితీరుకు నిదర్శనమని ప్రశ్నించారు.
నామినేషన్ పత్రాలను చించివేయడం, పోలింగ్ బూత్‌లను ఆక్రమించే పరిస్థితులు నెలకొనడం రాష్ట్రంలో ఎన్నికల నిర్వహణ ఎంతగా దిగజారిందో తెలియజేస్తోందన్నారు. ఇలాంటి ఘటనలు పోలీసు యంత్రాంగం వైఫల్యాన్ని స్పష్టం చేస్తున్నాయని పేర్కొన్నారు. కేంద్రంలో బీజేపీ కనుసన్నల్లో ఎన్నికల సంఘం ఓటర్లను తొలగిస్తోందని, రాష్ట్రంలోనూ అధికార యంత్రాంగం సహకారంతో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని ఆరోపించారు.
రాష్ట్ర ఎన్నికల సంఘం నిష్పక్షపాతంగా వ్యవహరించాలని, రానున్న గ్రామ పంచాయతీ ఎన్నికలను రాజ్యాంగబద్ధంగా, ఎలాంటి ప్రలోభాలు, బెదిరింపులకు తావులేకుండా స్వేచ్ఛాయుత వాతావరణంలో నిర్వహించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నిరంకుశ పాలకులకు ప్రజలు తగిన సమయంలో గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ప్రజలంతా ఐక్యంగా ముందుకు రావాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో సిపిఐ మహిళా నేత భవానీ, న్యూ డెమోక్రసీ నాయకులు వేణుగోపాల్, అడ్వకేట్ కాళి, సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు దువ్వ శేషబాబ్జి, ఎం. రాజశేఖర్, సిహెచ్. రాజ్ కుమార్, కె.ఎస్. శ్రీనివాస్, టేకుమూడి ఈశ్వరరావు, పలివెల వీరబాబు, అంబేద్కర్ ఉద్యమ నేతలు అయితాబత్తుల రామేశ్వరరావు, పిల్లి రామారావుతో పాటు పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
స్థానిక సంస్థ ల ఎన్నికల్లో రిగ్గింగ్ అక్రమాలుకి పాల్పడిన
కూటమి అప్రజాస్వామిక చర్యలుని ఖండించoడి
సిపిఎం.. సిపిఐ పిలుపు
ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద నిరసన
ప్రజాశక్తి..విజయనగరం టౌన్
రాష్ట్రం లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో పాలక కూటమి ప్రభుత్వం, టీడీపీ రౌడీలు, పోలీసులు కలసి ప్రతిఫక్షాలని నామీనేశాన్లు వేయకుండా అడ్డుకోవడం
రిగ్గింగ్ కి పాల్పడడం, లెక్కింపుల్లో అక్రమాలుకి పాల్పడిన నియంతృత్వ పోకడలు, అప్రజాస్వామిక చర్యలు ను ప్రజలంతా కండి oచాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు రెడ్డి శంకరరావు, సిపిఐ జిల్లా కార్యదర్శి ఒమ్మి రమణ లు
ప్రజలకి పిలుపునిచ్చారు. ఎన్నకల్లో అక్రమాలు కివ్యతిరేకంగా బుధవారం స్థానిక ఆర్టీసీకాంప్లెక్స్ వద్ద సిపిఎం, సిపిఐ నిరసన కార్యక్రమంచేపట్టాయి. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ ఎన్నికల్లో రిగ్గింగ్ కి పాల్పడిన వారిపైన గవర్నర్ చర్యలు
తీసుకోవాలని,ఎన్నికలు
ప్రజాస్వామ్యయుతంగా నిర్వహించ లేని ఎన్నికలు ప్రధానా అధికారి రాజీనామా చెయ్యాలని డిమాండ్ చేసారు.
అనేక చోట్ల నామినేషన్లు వేయకుండా పోలిసులే అడ్డుకోవడం, ఆర్వో లు చేతిలో నామీనేషన్ పారాలు తీసుకుని పారిపోవడం, నామీనేశన్లు వేసాక చట్ట విరుద్దంగా ప్రతిపక్షపార్టీలు అభ్యర్థులు నామీనేశన్లు విత్‌డ్రా చేయడం, చివరికి లెక్కింపులో కుడా అక్రమాలు కి పాల్పడిన కూటమిపార్టీల కార్యకర్తలు, నాయకులు పై చర్యలు తీయిసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమం లో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు జగన్ మోహన్, కె. సురేష్. నగరకమిటీ బి. రమణ, సిపిఐజిల్లా సమితి సభ్యులు రంగరాజు తదితరులు పాల్గొన్నారు.
స్థానిక ఎన్నికల్లో అధికార కూటమి అక్రమాలకు నిరసనగా ఈరోజు వామపక్షాల ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా *ప్రజాస్వామ్య పరిరక్షణ దినం* పిలుపు లో భాగం *తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి శ్యామల సెంటర్ లో ఆందోళన దృశ్యం....*
*నామినేషన్ పత్రాలు చించి వేయడం, ఓటింగ్ రాకుండా ప్రజలను అడ్డుకోవడం, పోలింగ్ బూత్ లను ఆక్రమించడం పోలీసు యంత్రాంగం సమక్షంలోనే జరగడం అత్యంత దారుణం*
*రాజమండ్రి కార్పొరేషన్,గ్రామ పంచాయతీ ఎన్నికలైనా నిష్పక్షపాతంగా, స్వేచ్ఛగా జరిగే విధంగా అధికార యంత్రాంగం తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్*

భీమవరం లో... రాష్ట్రం లో కూటమి ప్రభుత్వం మునిసిపల్, ZPTC, MPTC ఎన్నికలలో ప్రతీ పక్షాలు పై దౌర్జన్యాలు, అక్రమంగా, అధికార దుర్వినియోగం , బెదిరింపులు వంటి అప్రజాస్వామిక పద్ధతులను వ్యతిరేకస్తూ.... CPM -CPI ఆధ్వర్యంలో నిరసన ధర్నా జరిగింది.

నెల్లూరు: సి.పి.ఎం, సి.పి.ఐ ప్రజా సంఘాలు, వామపక్షాల నాయకులు ఆధ్వర్యంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార పార్టీ అక్రమాలను ఖండించండి.
"ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించండి" అని గూడూరు పాత బస్టాండ్ టవర్ క్లాక్ సెంటర్లో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహం ముందు నిరసన.

ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని కాపాడుకుందాం
స్థానిక ఎన్నికల్లో అధికార కూటమి అక్రమాలపై సిపిఎం- సిపిఐ నిరసన
చిత్తూరు: రాష్ట్ర కమిటీల పిలుపుమేరకు బుధవారం చిత్తూరు గాంధీ విగ్రహం వద్ద సిపిఐ-సిపిఎంలో ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వం స్థానిక ఎన్నికల్లో చేసిన అక్రమాలపై, దౌర్జన్యాలపై ఖండిస్తూ నిరసన

స్థానిక ఎన్నికల్లో అధికార కూటమి అక్రమాలను ఖండించండి
- ప్రభుత్వ వ్యవస్థల దుర్వినియోగం
- బరితెగించిన రిగ్గింగ్.. ఇదేనా గాంధీ కలలుగన్న గ్రామ స్వరాజ్యం?
అనకాపల్లి : స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార కూటమి ప్రభుత్వం సాగించిన అక్రమాలు, ప్రజాస్వామ్య వ్యతిరేక చర్యలను నిరసిస్తూ ఈరోజు అనకాపల్లి నాలుగు రోడ్ల జంక్షన్‌లోని డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహం వద్ద సిపిఎం, సిపిఐ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సిపిఎం అనకాపల్లి జిల్లా కార్యదర్శి జి. కోటేశ్వరరావు మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్‌లో ఇటీవల జరిగిన మున్సిపల్, ఎంపీటీసీ, జడ్పీటీసీ తదితర స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార కూటమి ప్రభుత్వం ప్రతిపక్ష పార్టీల పట్ల వ్యవహరించిన తీరు ప్రజాస్వామ్య వ్యవస్థకే మచ్చగా మారిందని విమర్శించారు.

ఇటీవల జరిగిన మున్సిపాలిటీ ఎంపీటీసీ జడ్పిటిసి ఎన్నికల అక్రమాలపై, బుధవారం నాడు స్థానిక ఎన్నార్టీ సెంటర్ వద్ద గల
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద సిపిఎం, సిపిఐ, కాంగ్రెస్ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నిరసన

సిపిఎం ఆధ్వర్యంలో విజయనగరం జిల్లా కొత్తవలస కూడలిలో నిరసన స్థానిక ఎన్నికలలో కూటమి ప్రభుత్వం దౌర్జన్యాలపై నిరసన

స్థానిక ఎన్నికల్లో కూటమి అక్రమాలు
- అంబేద్కర్ సర్కిల్లో సిపిఎం, సిపిఐ ఆందోళన
కడప అర్బన్ : జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార పార్టీ అక్రమాలపై ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం కడప నగరంలోని అంబేద్కర్ సర్కిల్లో సిపిఎం, సిపిఐ నగర కమిటీల ఆధ్వర్యంలో బుధవారం ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఎం, సిపిఐ నగర కార్యదర్శులు రామమోహన్, వెంకటశివ మాట్లాడుతూ ఈ ఎన్నికల్లో ప్రజల పాత్ర ఏమీ లేదని, పోలీసులు, టిడిపి గూండాల పాత్రే ఉందని, అటువంటప్పుడు ఎన్నికలు ఎందుకని ప్రశ్నించారు. దాడులు, దౌర్జన్యాలతో ప్రజలను రానీయకుండా అభ్యర్థులను, ఏజెంట్లను భయపెట్టి నిర్బంధించి రిగ్గింగు చేసుకున్నారని, ఇది ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని ఖూనీ చేయడమేనని తీవ్రంగా విమర్శించారు. డబ్బు పంపకం, హెచ్చరికలు, పోలీసు కేసులు, బెదిరింపులకు పాల్పడి పూర్తి అప్రజాస్వామిక పద్ధతుల్లో ఎన్నికలు జరుపుకున్నారని విమర్శించారు. రాష్ట్ర చర్రితలో ఎన్నడూ లేని విధంగా ఎన్నికల అక్రమాలు జరిగాయని విమర్శించారు. ఎమ్మెల్యేలు అధికారాన్ని, పోలీసులను అడ్డుపెట్టుకుని ఇష్టారాజ్యంగా చేశారని తెలిపారు. యథేచ్ఛగా రిగ్గింగు చేశారని, అడ్డుకున్న వామపక్ష పార్టీల అభ్యర్థులను పోలీసులు వచ్చి కొట్టి నిర్బంధించారని పేర్కొన్నారు. ప్రశాంతంగా ఎన్నికలు అంటే ఏజెంట్లను కొట్టడం, బెదిరించడం, రిగ్గింగు అని టిడిపి కొత్త నిర్వచనం చెబుతోందని తెలిపారు. కార్యక్రమానికి సిపిఎం నేతలు అన్వేష్, దస్తగిరిరెడ్డి, కామనూరు శ్రీనివాసులు రెడ్డి, జమీల, శంషాద్, రాజమణి, రామకృష్ణారెడ్డి, నారాయణరెడ్డి, నరసింహ, రవి, రఘు, అఖిలేష్, సిపిఐ నేతలు రాజారెడ్డి, నాగసుబ్బారెడ్డి, బాదుల్లా, సుబ్రమణ్యం, మనోహర్ రెడ్డి, భాగ్యలక్ష్మి, మల్లికార్జున పాల్గొన్నారు.


గుంటూరు జిల్లా : స్థానిక సంస్థల ఎన్నికలలో అధికార కూటమి ప్రభుత్వ అక్రమాలను ఖండిస్తూ సిపిఎం, సిపిఐ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్త పిలుపులో భాగంగా బుధవారం గుంటూరు లాడ్జి సెంటర్ లోని అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కే నళినీకాంత్, సిపిఐ జిల్లా కార్యదర్శి కే మాల్యాద్రి తదితరులు ప్రసంగించారు.నల్ల బ్యాడ్జిలు ధరించి నిరసన తెలిపారు.

అనకాపల్లి - అచ్యుతాపురం: రాష్ట్రంలో జరిగిన స్థానిక ఎన్నికలు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశాయని బిజెపితో జతకట్టిన డబుల్ ఇంజన్ సర్కార్ అప్రజాస్వామికంగా వ్యవహరించిందని దీనిని నిరసిస్తూ రాష్ట్ర పిలుపులో భాగంగా అచ్చుతాపురం నాలుగు రోడ్ల కూడలిలో నిరసన తెలియజేయడం జరిగింది. ఈ సందర్భంగా అచ్యుతాపురం కన్వీనర్ ఆర్ రాము, సిపిఎం సీనియర్ నాయకులు కర్రి అప్పారావు మాట్లాడుతూ స్థానిక ఎన్నికల్లో ప్రత్యర్ధులను నామినేషన్ వేయకుండా అడ్డుకోవడం నామినేషన్ పత్రాలను చిoచడం భౌతిక దాడులు చేయడం పోలింగ్, కౌంటింగ్ లో రిగ్గింగ్ చేయడం లాంటి అనేక ఘటనలు అనేక ప్రాంతాల్లో జరిగాయని గతంలో వైసిపి చేసింది. కాబట్టి 'ఇప్పుడు మేము చేస్తామని' టిడిపి సమర్థించుకుంటుంది. రెండు సంవత్సరాల తర్వాత వడ్డీతో సహా చెల్లిస్తామని వైసిపి నేతలు చేస్తున్న ప్రకటనలు రాష్ట్రాన్ని రావణ కాష్టంగా మారుస్తున్నారు కమ్యూనిస్టులను అడ్డుకున్నారు ఈఎన్నికల్లో డబ్బు, మద్యం వేద జళ్లడంతో పాటు హింసకు పాల్పడ్డారు రాజ్యాంగ వ్యవస్థలపై దాడులు చేస్తూ ప్రజాస్వామ్య గొంతు నొక్కుతున్నారని ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా రాబోయే సర్పంచ్ ఎన్నిక సజావుగా సాగేలా చర్యలు చేపట్టాలని సిపిఎం డిమాండ్ చేస్తున్నది. ఈ కార్యక్రమంలో గంగిరెడ్డి నారాయణమ్మ, ఆర్ లక్ష్మీ, కడారి అప్పారావు, వసంత, చాపల తాతీయులు, రాము తదితరులు పాల్గొన్నారు.







కామెంట్లు (0)