-ఎపిటిఎఫ్
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : రాష్ట్ర బడ్జెట్‌లో ఉద్యోగుల జీతాలు, పెన్షన్లకు తోంబై ఐదుశాతం ఖర్చవుతోందంటూ జరుగుతున్న ప్రచారం వాస్తవాలకు విరుద్ధమని ఎపిటిఎఫ్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు జి హృదయ రాజు, ఎస్ చిరంజీవి స్పష్టం చేశారు. 2026,27 ఆర్థిక సంవత్సరానికి ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ గణాంకాలను పరిశీలిస్తే ఉద్యోగుల జీతాలు, పెన్షన్ల వ్యయం మొత్తం బడ్జెట్ వ్యయంలో సుమారు 28.4 శాతం మాత్రమేనని ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. రెవెన్యూ వ్యయంలో జీతాలు, పెన్షన్ల వాటా సుమారు 36.9 శాతం కాగా, రాష్ట్ర సొంత రెవెన్యూ పరంగా చూసినా ఈ వ్యయం 68 శాతం మాత్రమేనన్నారు.
ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు ప్రజలకు వివిధ సేవలు అందిస్తున్నందున వారి జీతాలను ప్రభుత్వంపై ఆర్థిక భారంగా చూపడం సమంజసం కాదని పేర్కొన్నారు. ఉద్యోగులు, ఉపాధ్యాయులకు రావాల్సిన ఆర్థిక ప్రయోజనాలను ప్రభుత్వం ఎప్పటికప్పుడు చెల్లించకుండా దాటవేసేందుకు ఇలాంటి గణాంకాలను ప్రచారం చేయడం తగదని హితవు పలికారు. వెంటనే 12వ వేతన సవరణ సంఘాన్ని ఏర్పాటు చేసి, 30 శాతం మధ్యంతర భృతిని ప్రకటించాలని, పెండింగ్ డిఎలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు.








కామెంట్‌లు (0)