బుధవారం, 02 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print EditionWomen's Asia Cup:మరో గెలుపుపై హర్మన్‌‌ప్రీత్‌ ‌సేన గురి

1 గంట క్రితం

indiawomens2-1788363707129-4682.jpg
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 03, 2026, 12:29 పూర్వాహ్నం | 2 నిమిషాల చదవడం

  • నేడు హాంకాంగ్‌ ‌మహిళలతో అమీ తుమీ

  • రాత్రి 8.00గం.ల నుంచి

  • మహిళల ఆసియాకప్‌ ‌టోర్నీ

దుబాయ్‌: ఆసియాకప్‌ ‌మహిళల క్రికెట్‌ ‌టోర్నీలో భారత మహిళలజట్టు మరో పోరుకు సిద్ధమైంది. తొలి మ్యాచ్‌‌లో థాయ్‌‌లాండ్‌‌పై సునాయాసంగా విజయం సాధించిన హర్మన్‌‌ప్రీత్‌ ‌సేన గురువారం జరిగిన గ్రూప్‌ ‌లీగ్‌ ‌రెండో మ్యాచ్‌‌లో హాంకాంగ్‌‌(చైనా)తో తలపడనుంది. గ్రూప్‌-ఎలో ఉన్న భారత్‌, పాకిస్తాన్‌ ఒక్కో విజయంతో టాప్‌‌లో కొనసాగుతున్నాయి. ఈ గ్రూప్‌‌లో రెండో మ్యాచుల్లో ఓడిన థాయ్‌లాండ్‌ ‌జట్టు సెమీస్‌ ‌రేసునుంచి ఇప్పటికే నిష్ర్కమించగా.. హాంకాంగ్‌‌పై గెలిస్తే భారత మహిళల జట్టుకు సెమీస్‌ ‌బెర్త్‌ ‌ఖాయం కానుంది. 2023లో జరిగిన ఏసీసీ మహిళల ఎమర్జింగ్‌ ఆసియా కప్‌లో భారత మహిళలజట్టు హాంగ్‌ కాంగ్‌ను కేవలం 34పరుగులకే ఆలౌట్‌ ‌చేసింది. ఇండియా-ఎ మహిళల తరఫున శ్రేయాంకా పాటిల్‌ ఐదు వికెట్లతో చెలరేగగా.. పార్శవీ చోప్రా, మన్నత్‌ కశ్యప్‌లు తలా రెండు వికెట్లు పడగొట్టారు. మళ్లీ మూడేళ్ల తర్వాత ఆసియాకప్‌‌లో ఇరుజట్లు తలపడుతున్నాయి. మహిళల టీ20 ఆసియా కప్‌లో భారత్‌ శుభారంభం చేసింది. థాయ్‌లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా 94 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. 160 పరుగుల లక్ష్యంతో ఛేదనకు దిగిన థాయ్‌లాండ్‌ .. 16.1 ఓవర్లలో 65 పరుగులకే ఆలౌటైంది. భారత బౌలర్లలో నందనీ శర్మ, దీప్తిశర్మ చెరో 3 వికెట్లు పడగొట్టారు. క్రాంతి గౌడ్‌ ఒక వికెట్‌, శ్రీచరణి 2 వికెట్లు తీశారు. టీమిండియా బ్యాటర్లలో ఓపెనర్ షెఫాలీ వర్మ (64; 36 బంతుల్లో 8 ఫోర్లు, 3 సిక్స్‌లు) మెరుపు అర్ధ శతకం బాదింది. ఈ మ్యాచ్‌తోనే టీ20ల్లోకి అరంగేట్రం చేసిన ప్రతీకా రావల్ (22; 18 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్‌) ఫర్వాలేదనిపించింది. హర్మన్‌‌ప్రీత్‌, దీప్తి శర్మ, రీచా ఘోష్‌కి తోడు స్టార్‌ ‌బ్యాటర్‌ సృతి మందాన నిరాశపరిచారు. దీంతో వీరంతా బ్యాటింగ్‌‌లో రాణిస్తే టీమిండియా భారీస్కోర్‌ ‌చేయడం ఖాయం.
జట్లు(అంచనా)..
ఇండియా మహిళలు: హర్మన్‌ ‌ప్రీత్‌(‌కెప్టెన్‌), మంధాన, షెఫాలీ వర్మ, ప్రతిక రావల్‌, ఫుల్మాలి, రీచా ఘోష్‌(వికెట్‌ ‌కీపర్‌), దీప్తి శర్మ, ప్రేమ రావత్‌, నందిని శర్మ, శ్రీచరణి, క్రాంతి గాడ్‌.
హాంకాంగ్‌ ‌మహిళలు: మర్యాన్‌ ‌బిబి(కెప్టెన్‌), కెరీ ఛాన్‌, మారికో హిల్‌, యాస్మిన్‌(వికెట్‌ ‌కీపర్‌), మారినా, షాంజీన్‌, జైలీన్‌ ‌కౌర్‌, షింగ్‌చాన్‌, రుచిత, అలీసన్‌, ఛార్లోటే.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్