బుధవారం, 02 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionయువత చేతుల్లో దేశ భవిష్యత్తు

1 గంట క్రితం

mlc
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 03, 2026, 12:12 పూర్వాహ్నం | 3 నిమిషాల చదవడం

  • పాలకుల జవాబుదారీతనానికై పోరాడాలి

  • డివైఎఫ్‌ఐ రాష్ట్ర మహాసభ ప్రారంభ కార్యక్రమంలో మాజీ ఎంఎల్‌సి లక్ష్మణరావు

  • ఉత్సాహంగా ప్రతినిధుల సభ ప్రారంభం

ప్రజాశక్తి- నెల్లూరు ప్రతినిధి : దేశ భవిష్యత్‌ ‌జెన్‌ ‌జీ చేతుల్లోనే ఉందని మాజీ ఎంఎల్‌‌సి కెఎస్‌ ‌లక్ష్మణరావు అన్నారు. నెల్లూరు నగరంలో డాక్టర్ జెట్టి శేషారెడ్డి విజ్ఞాన భవనంలో (గోను చలపతి, చెంచయ్య నగర్ ) కె.పెంచలయ్య ప్రాంగణంలో బుధవారం డివైఎఫ్‌ఐ 16వ రాష్ట్ర మహాసభ ఉత్సాహపూరిత వాతావరణంలో ప్రారంభమైంది. అంతకుముందు డివైఎఫ్‌ఐ పతాకాన్ని రాష్ట్ర అధ్యక్షులు వై. రాము ఆవిష్కరించారు. రాష్ట్రం నలుమూలల నుండి వచ్చిన ప్రతినిధులు పతాకావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. అమరవీరులకు జోహార్లర్పించారు. అనంతరం జరిగిన సభలో ప్రారంభోపన్యాసం చేసిన కెఎస్‌ ‌లక్ష్మణరావు దేశ స్వాతంత్ర్య సమరాన్ని గుర్తు చేశారు. ఆ స్ఫూర్తితో దేశాన్ని అభివృద్ధి బాటలో నడిపించేందుకు మరో స్వాతంత్ర పోరాటంచేయడానికి యువత సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. భారత స్వాతంత్ర్య ఉద్యమం కొన్ని లక్ష్యాలు, ఆదర్శాలు ఇచ్చిందని, ఇప్పుడు దేశంలోని యువత పోరాటాలకు ముందుకు వస్తున్నారని, వారిని ముందుండి నడిపించాల్సింది డివైఎఫ్‌ఐ వంటి సంస్థలేనని చెప్పారు. స్వాతంత్ర పోరాట కాలంలో అతి చిన్న వయస్సులో భగత్ సింగ్, రాజగురు, సుఖదేవ్ దేశం కోసం ప్రాణత్యాగం చేశారని, అప్పట్లో వేలాది మంది యువకులను కాల్చి, ఉరితీసి చంపివేశారన్నారు. ఆనాటి యువత దేశానికి స్వాతంత్ర్యం వస్తే ప్రజలు స్వేచ్ఛగా ఆర్థికంగా, రాజకీయ స్వాతంత్ర్యం కలిగి ఉంటారని భావించారని, అందుకే ప్రాణ త్యాగాలకు కూడా వెరవకుండా స్వాతంత్ర పోరాటంలోకి దూకారని చెప్పారు. ఫ్రెంచ్‌ విప్లవంతో సమానంగా దేశంలో స్వాతంత్ర్య పోరాటం సాగిందన్నారు. దేశ పొరాటంలో కోట్లాది మంది పాల్గొన్నారని, అందులో యువత పాత్ర కీలకమన్నారు. అంతమంది త్యాగాలతో సాధించుకున్న స్వాతం త్ర్యాన్ని, 76 సంవత్సరాల రాజ్యాంగ లక్ష్యాలను ప్రస్తుత పాలకులు సరిగా నిర్వహించడం లేదన్నారు. 1950-60 మధ్య అప్పటి ప్రభుత్వం భారీ పరిశ్రమలు ఏర్పాటు చేసిందన్నారు. ఐఐటి, ఐఐఎం, ఎన్ఐటి, యుజిసి, ఇస్రో వంటి సంస్థలను ఏర్పాటు చేసిందని చెప్పారు. దీనికి భిన్నంగా ప్రస్తుత మోడీ ప్రభుత్వం విగ్రహాలు ఏర్పాటు చేస్తోందన్నారు. గత 12 సంవత్సరాల్లో ఒక్క భారీ ప్రాజెక్టు ఏర్పాటు చేయలేదన్నారు. అభివృద్ధి చేయకపోగా దేశంలోని ప్రజలను మతం పేరుతో విడదీయడానికి చూస్తున్నారని చెప్పారు. . ఎవరూ మాట్లాడకుండా , నిరసన చేసే హక్కు, ఏదీ లేకుండా కేంద్ర ప్రభుత్వం చేస్తోందన్నారు. యువతకు మోడీ ప్రభుత్వం ఏమి చేసిందని ప్రశ్నించారు. ఇటీవల నీతి ఆయోగ్ ఒక రిపోర్టు ఇచ్చిందని, అందులో 8.7 కోట్ల మందికి ఎటువంటి శిక్షణ, నైపుణ్యం లేదని తేల్చిందన్నారు. ప్రభుత్వం నైపుణ్యం నేర్పాల్సి ఉందని, ఆ పని చేయకపోగా, 2014-26 వరకు రూ.34 వేల కోట్లు నైపుణ్యం శిక్షణకు ఖర్చు చేసినట్లు ప్రకటించడం విడ్డూరంగా ఉందన్నారు. దేశంలో 12 సంవత్సరాల్లో యువతకు ఏమీ చేయలేదన్నారు. ఈ నేపథ్యంలో జెన్‌ జీ ఉద్యమం వచ్చిందని, దానిని ఎస్ఎఫ్‌ఐ, డివైఎఫ్ఐ వంటి సంస్థలు ముందుడి నడిపించాయన్నారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేసే వరకు యువత పోరాడిందన్నారు. ఇది దేశ చర్రితలో నిలిచిపోయే సంఘటన అన్నారు. మరో స్వాతంత్ర్య పోరాటానికి యువత సిద్ధం కావాల్సి ఉందన్నారు. ఈ సభకు వై.రాము, యుఎస్ఎన్ రాజు, కె. రమేష్, అంజనేయరాజు, శిరీష, బాబు అధ్యక్ష వర్గంగా వ్యవహరించారు. సభలో ఆహ్వాన సంఘం అధ్యక్షులు చొప్పా రవీంద్రబాబు, డివైఎఫ్ఐ ఆల్ ఇండియా కార్యదర్శి హిమాన్షు రాజ్ భట్టాచార్య, డివైఎఫ్‌ఐ రాష్ట్ర కార్యదర్శి రామన్న, డివైఎఫ్ఐ నెల్లూరు జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు బివి నరసింహ, ఎంవి రమణ పాల్గొన్నారు.

dyfi

10 తీర్మానాలు ఆమోదం..

డివైఎఫ్ఐ రాష్ట్ర మహాసభల్లో 10 తీర్మానాలను ఆమోదించారు. అవి . 1. రాజకీయ నాయకులు జవాబుదారీతనంగా వ్యవహరించాలి. 2 స్థానిక సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలి. 3. డ్రగ్స్ , గంజాయి మాఫియాపై కఠిన చర్యలు తీసుకోవాలి. 4. పర్రిశమల్లో యువతకు 75 శాతం ఉద్యోగాలివ్వాలి. 5. నిరుద్యోగ భృతి హామీని నిలబెట్టుకోవాలి. 6. క్రీడా మైదానాలు, పార్కులు, జిమ్ లు ఏర్పాటు చేయాలి 7. ప్రభుత్వ శాఖల్లో ఖాళీ పోస్టులు భర్తీ చేయాలి 8. ప్రత్యేక హోదా , విభజన హామీలు అమలు చేయాలి 9 పోటీ పరీక్షలకు ఉచిత కోచింగ్ ఇవ్వాలి 10. బ్యాక్ లాగ్ పోస్టులు, కార్పొరేషన్ రుణాలు , కులాంతర వివాహాలకు ప్రోత్సాహకాలు ఇవ్వాలి.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్