శనివారం, 10 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్
Live News

Live: ‘చలో లోక్‌భవన్‌'ను అడ్డుకుంటున్న 'కూటమి'

1 గంట క్రితం

cpm
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 10, 2026, 08:17 పూర్వాహ్నం | 0 నిమిషాల చదవడం


Live Updates
27 minutes agoOct 10, 2026 09:18 AM IST

గుంటూరు (తాడేపల్లి) : విజయవాడ చలో లోక్ భవన్ కు అనుమతి లేదంటూ ఎంటిఎంసీ పరిధిలోని గుండిమెడ గ్రామంలో సిపిఎం తాడేపల్లి మండల కార్యదర్శి పల్లె కృష్ణను ఇంటి వద్ద అడ్డుకొన్న తాడేపల్లి పోలీసులు.


gnt



Live Updates
33 minutes agoOct 10, 2026 09:12 AM IST

విజయవాడ : లోక్ భవన వద్ద మోహరించిన పోలీసులు, ఏర్పాటు చేసిన కంచె, బారికేడ్లు


police


Live Updates
35 minutes agoOct 10, 2026 09:10 AM IST

విజయవాడ : సిపిఎం నేత కే దుర్గారావును అడ్డుకున్న పోలీసులు, అజిత్ సింగ్ నగర్ సిపిఎం కార్యాలయం వద్ద నిరసన తెలుపుతున్న దుర్గారావు


cpm


Live Updates
40 minutes agoOct 10, 2026 09:05 AM IST

విజయవాడలో ముందస్తు అరెస్టులు, పోలీసుల నిర్బంధం

విజయవాడ: ఎన్నికల ప్రధాన అధికారి జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలని కోరుతూ నగరంలో చేపట్టిన నేడు జరగనున్న ‘చలో లోక్‌భవన్‌’ కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు పోలీసులు సీపీఎం నేతలపై ముందస్తు నిర్బంధ చర్యలకు దిగారు. ఈ మేరకు సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు సీహెచ్‌ బాబూరావు సోషల్ మీడియా వేదికగా పోస్టు చేశారు. పలువురు నాయకులను హౌస్ అరెస్టు చేయగా, మరికొందరి ఇళ్ల వద్ద పోలీసులు మోహరించారు. నగరంలోని పలువురు నేతలకు ఫోన్లు చేసి విచారించడంతో పాటు, బయటకు రావద్దని హెచ్చరిస్తున్నట్లు ఆయన తెలిపారు. తన ఇంటికి అర్ధరాత్రి రెండు గంటల సమయంలో పోలీసులు వచ్చానరని, పాయకాపురం, శాంతినగర్‌ ప్రాంతాల్లో సీపీఎం నేత సీహెచ్‌ శ్రీనివాస్‌ను హౌస్ అరెస్టు చేసి, ఆయన ఇంటి వద్ద పోలీసులు కాపలా కాస్తున్నారని తెలిపారు. మరో నేత బోయి సత్యబాబు ఇంటికి వచ్చిన పోలీసులు ఇంట్లో మహిళలను భయభ్రాంతులకు గురి చేశారు.


arresty



Live Updates
about 1 hour agoOct 10, 2026 08:58 AM IST

ప్రజాశక్తి-తాడికొండ: చలో లోక్ భవన్ కు అనుమతులు లేవంటూ రైతు సంఘం మండల కార్యదర్శి చింతల భాస్కరరావును అర్ధరాత్రి అదుపులోకి తీసుకున్న పోలీసులు. చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలంటూ ప్రజాసంఘాలు చలో లోక్ భవన్ కు పిలుపునిచ్చిన నేపథ్యంలో ఆయన ఇంటిలో నుండి అదుపులోకి తీసుకున్న పోలీసులు. వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు గుర్రంకొండ సత్యానందంను అదుపులోకి తీసుకున్న పోలీసులు.


arrest



Live Updates
about 1 hour agoOct 10, 2026 08:26 AM IST

తుళ్లూరు పోలీస్ స్టేషన్ లో కెవిపిఎస్ జిల్లా కార్యదర్శి జె నవీన్ ప్రకాష్

ప్రజాశక్తి - తుళ్లూరు: 'చలో లోక్ భవన్' కార్యక్రమంలో పాల్గొనకుండా కెవిపిఎస్ జిల్లా కార్యదర్శి జొన్నకూటి నవీన్ ప్రకాష్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. శనివారం తెల్లవారుజామున తుళ్లూరులోని ఆయన ఇంటికి వెళ్లి అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్ కు తరలించారు.


sasa



Live Updates
about 1 hour agoOct 10, 2026 08:20 AM IST

సీపీఎం రాష్ట్ర కార్యాలయం వద్ద భారీగా పోలీసుల మోహరింపు

విజయవాడ: ‘చలో లోక్‌భవన్‌’ కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు విజయవాడలోని గవర్నర్‌పేటలో ఉన్న సీపీఎం రాష్ట్ర కార్యాలయం వద్ద పోలీసులు భారీగా మోహరించారు. కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చే నాయకులు, కార్యకర్తలను అడ్డుకునేందుకు పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేసినట్లు సీపీఎం వర్గాలు పేర్కొన్నాయి. ఎన్నికల కమిషన్‌ అక్రమాలను ప్రశ్నించాల్సిన చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌, టీడీపీ, జనసేన నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం అందుకు భిన్నంగా వ్యవహరిస్తోందని సీపీఎం నేతలు విమర్శించారు. ఎన్నికల కమిషన్‌ చర్యలను ప్రశ్నిస్తూ ప్రజాస్వామ్యబద్ధంగా ఉద్యమిస్తున్న రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాలపై నిర్బంధాన్ని ప్రయోగించడం సిగ్గుచేటని మండిపడ్డారు. ప్రజాస్వామ్య హక్కులను పరిరక్షించాలని, ఎన్నికల ప్రక్రియలో అక్రమాలపై ప్రశ్నలకు సమాధానాలు చెప్పాలని డిమాండ్‌ చేస్తూ చేపట్టిన ఆందోళనలను అడ్డుకోవడం సరికాదని సీపీఎం నేతలు పేర్కొన్నారు. శాంతియుత నిరసనలకు అవకాశం కల్పించాలని డిమాండ్‌ చేశారు.

cpm



సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్