మంగళవారం, 24 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

26న సంవిధాన్‌ రక్ష మార్చ్‌

3 రోజుల క్రితం

congress
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 21, 2026, 08:39 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

- ఎపిసిసి ప్రకటన

ప్రజాశక్తి - అమరావతి బ్యూరో : రాజ్యాంగం కల్పించిన హక్కులు, స్వేచ్ఛ, సమానత్వం, సామాజిక న్యాయం వంటి మౌలిక సూత్రాలను పరిరక్షించడం లక్ష్యంగా నవంబర్ 26వ తేదీన రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా “సంవిధాన్ రక్షా మార్చ్” కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఎపిసిసి ఉపాధ్యక్షులు కొలనుకొండ శివాజీ తెలిపారు. ఈ మేరకు శనివారం ప్రకటన విడుదల చేశారు. ప్రజాస్వామ్యానికి, ఓటు హక్కుకు విఘాతం కలిగిస్తున్న సర్‌ ప్రక్రియను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. 2023 నుంచి ఎన్నికల ప్రక్రియలో ఒక రాజకీయ పార్టీకి అనుకూలంగా అవకతవకలు జరిగాయన్న ఆరోపణల నేపథ్యంలో, ఎన్నికల కమిషన్ విశ్వసనీయతను కాపాడేందుకు ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు. రాజ్యాంగబద్ధమైన సంస్థలన్నీ రాజకీయ ప్రభావాలకు అతీతంగా స్వతంత్రంగా, నిష్పక్షపాతంగా పనిచేయాలని, ప్రజాస్వామ్య వ్యవస్థను కాపాడేందుకు ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతగా ముందుకు రావాలని కోరారు. నవంబర్ 26వ తేదీన ఉదయం 11 గంటలకు విజయవాడలోని ఆంధ్రరత్న భవన్ నుంచి పిడబ్ల్యూడి గ్రౌండ్స్‌లోని డాక్టర్‌ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహం వరకు ‌జరిగే ఈ మార్చ్‌‌లో ఎపిసిసి పరిశీలకు పి.వి. మోహన్‌ ‌తదితరులు పాల్గొంటారని తెలిపారు.


సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్