శుక్రవారం, 20 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

ఫీజు రీయంబర్స్‌‌మెంట్‌ కోసం ఎస్ఎఫ్ఐ పోరుబాట

1 గంట క్రితం

ఫీజు రీయంబర్స్‌‌మెంట్‌ కోసం ఎస్ఎఫ్ఐ పోరుబాట
- ఉన్నత విద్యాశాఖ కమిషనర్ కార్యాలయం వద్ద నిరసన, ధర్నా
- విద్యార్థులను ఒత్తిడి చేయకుండా కాలేజీలకు సర్క్యులర్‌ ఇస్తామని కమిషనర్‌ హామీ image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 21, 2026, 12:30 పూర్వాహ్నం | 2 నిమిషాల చదవడం

- ఉన్నత విద్యాశాఖ కమిషనర్ కార్యాలయం వద్ద నిరసన, ధర్నా

- విద్యార్థులను ఒత్తిడి చేయకుండా కాలేజీలకు సర్క్యులర్‌ ఇస్తామని కమిషనర్‌ హామీ

ప్రజాశక్తి-తాడేపల్లి (గుంటూరు జిల్లా) :' విద్యార్థులను పట్టిపీడిస్తున్న ఫీజు రియంబర్స్‌‌మెంట్‌ బకాయిలు, విద్యార్థులు ఎదుర్కొనే సమస్యల పరిష్కారించాలని డిమాండ్‌ ‌చేస్తూ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో గుంటూరు జిల్లా తాడేపల్లిలోని ఉన్నత విద్యాశాఖ కమిషనర్ కార్యాలయం వద్ద శుక్రవారం ధర్నా జరిగింది. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్య‌క్ష కార్యదర్శులు పి రామ్మోహన్‌రావు, కె ప్రసన్నకుమార్ మాట్లాడాతూ ప్రభుత్వ విధానాల వల్ల విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ‌గత అసెంబ్లీ ఎన్నికల ముందు విద్యార్థులకు ఇచ్చిన హామీల అమలులో టిడిపి కూటమి ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. ఫీజు రియంబర్స్‌‌మెంట్‌ బకాయిలను విడుదల చేయకుండా రూ.4,962 కోట్ల ఫీజులు చెల్లించినట్లు ప్రకటించుకున్నారని, మంత్రి లోకేష్ గొప్పలకు పోకుండా వాస్తవాలతో కూడిన శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

ఇంకా రూ.4,500 కోట్లు బకాయిలు ఉన్నాయని, అవి విడుదల కాకపోవడంతో వేలాది మంది పేద, మధ్యతరగతి విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. కళాశాల యాజమాన్యాలు ఫీజులు చెల్లిస్తేనే హాల్‌టికెట్లు, సర్టిఫికెట్లు ఇస్తామని ఒత్తిడి చేస్తున్నాయని, దీంతో విద్యార్థులు చదువును కొనసాగించలేకపోతున్నారని, ఫీజుల భారాన్ని తట్టుకోలేక రాష్ట్రంలో ‌కొంత మంది విద్యార్థులు ప్రాణాలు కోల్పోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. జిఒ 77ను రద్దు చేస్తామని ఇచ్చిన హామీని వెంటనే అమలు చేయాలని డిమాండ్‌ ‌చేశారు. రాష్ట్రంలోని ప్రభుత్వ పీజీ కళాశాలలు, విశ్వవిద్యాలయాల్లో స్పాట్ అడ్మిషన్ల ద్వారా ఖాళీ సీట్లను వెంటనే భర్తీ చేయాలని కోరారు. విద్యార్థుల సమస్యలను వెంటనే పరిష్కరించకుంటే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమిస్తామని, అవసరమైతే చలో అసెంబ్లీ నిర్వహిస్తామని హెచ్చరించారు. తొలుత కార్యాలయానికి ప్రదర్శనగా వచ్చిన విద్యార్థులు ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు అనంతరం అక్కడే బైఠాయించి ధర్నా చేశారు. కొద్దిసేపటికి ఉన్నత విద్యాశాఖ కమిషనర్ భరత్ గుప్తా వారివద్దకు వచ్చి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఫీజుల కోసం విద్యార్థులపై ఒత్తిడి చేయకుండా కాలేజీలకు సర్కులర్‌ ఇస్తామని, ఇతర సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ రాష్ట్ర ఉపాధ్యక్షులు భగత్ రవి, సహాయ కార్యదర్శులు రాము, సమీర్, ప్రసాద్, సూరిబాబు, రాష్ట్ర కమిటీ సభ్యులు పవిత్ర, చిన్ని, మౌనిక, భారతి, చిన్నబాబు, షణ్ముఖ, రాజ్ కుమార్, విద్యార్థులు పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్